Nani, Srikanth Odela, Dasara, Paradise
సినిమా పరిశ్రమకు లీక్ ల బెడద చాలా కాలం నుంచి ఉన్నదే. అయితే లీక్ లను ఓ రకంగా పబ్లిసిటీగా చూస్తారు చాలా మంది. ఇంటర్నల్ గా తిట్టుకున్నా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేయరు.
అయితే హీరో నాని (Nani)తో తాను తెరకెక్కిస్తోన్న కొత్త సినిమా టైటిల్ లీక్ కావడంపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసని అన్నారు. తన టీమ్‌తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Nani, Srikanth Odela, Dasara, Paradise
నాని హీరోగా వచ్చిన‘దసరా’తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ అద్భుతంగా సినిమా తెరకెక్కించారని అందరూ మెచ్చుకున్నారు.
వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం ఇది షూటింగ్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రానికి ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్ర టీమ్ ప్రకటించేలోగా టైటిల్ లీక్ కావడంపై శ్రీకాతం అసహనం వ్యక్తం చేసింది.
Srikanth Odela Nani upcoming film budget revealed
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ..‘‘నా సినిమాకే కాదు.. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే.. అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిది. సినీ రంగానికి సంబంధించి రాబోయే తరం క్రియేటర్స్ వాళ్లు.
సినిమా రంగానికి వారు అందించే నిస్వార్థమైన సేవలను ఎంతగానో గౌరవించాలి. కష్టపడి పనిచేసే డిపార్ట్‌మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోండి. నా సినిమా టైటిల్‌ను లీక్ చేసిన వ్యక్తులెవరో నాకు తెలుసు. వాళ్లు నా టీమ్‌లోని సభ్యులు కాదు’’ అని పేర్కొన్నారు.
Nani, Srikanth Odela, Dasara, Paradise
ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం లొకేషన్స్ హాంట్ పూర్తైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా చాలా వరకూ వయొలెన్స్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. మాగ్జిమం కథలో ఎక్కువ భాగం ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం కథ సాగుతుందట.
నాని గత చిత్రం ‘సరిపోదా శనివారం’ లో సోకులపాలెం అనే ఫిక్షనల్ ఏరియాని సృష్టించినట్టే.. ఈ సినిమాలో కూడా ఓ ఫిక్షనల్ ఏరియాని సృష్టించారట. దాని పేరు ‘ప్యారడైజ్’ అని తెలుస్తుంది. ఆ పదానికి ‘స్వర్గం’ అనే మీనింగ్ . కానీ సికింద్రాబాద్ లో ‘ప్యారడైజ్’ పేరుతో రెస్టారెంట్లు ఉంది. ప్యారడైజ్ అనేది చాలా పాపులర్ పేరు.
Srikanth Odelas Nani starrer film update out
ఈ సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం సికంద్రాబాద్,పాత బస్తీలో జరుగుతుంది. ఆ మేరకు భారీ సెట్లు కూడా వేశారు. ఎనభై తొంభై దశకం మధ్య జరిగిన ఒక సంచలనాత్మక సంఘటనను బేస్ చేసుకుని శ్రీకాంత్ ఓదెల ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
అలాగే కథలో ... జంట నగరాల్లో కీలకమైన ల్యాండ్ మార్క్ గా చెప్పుకునే ప్యారడైజ్ నేపథ్యంలో కీలకమైన మలుపులు ఉందని ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు.
అలాగే నాని ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా చేయబోతున్నాడట. పక్క భాషల్లోని నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తారు. దీనిని కూడా ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి ఏకంగా రూ.125 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.