పూజా హెగ్డే మ్యాటర్‌ లీక్‌ చేసిన బాలకృష్ణ, దెబ్బకి బన్నీలో టెన్షన్‌.. ఆయన్ని మార్చేసిన ఆయుధం ఆమే!

First Published | Nov 10, 2024, 1:41 PM IST

బాలయ్య మామూలోడు కాదు, తన షోలో అల్లు అర్జున్‌ రహస్యాలు బయటపెట్టాడు. పూజా హెగ్డే మ్యాటర్‌ లీక్‌ చేసి షాకిచ్చాడు. దీంతో బన్నీ రియాక్షన్‌ ఏంటంటే?
 

photo credit-aha unstoppable4 promo

అల్లు అర్జున్‌ ఇప్పుడు `పుష్ప2`తో బిజీగా ఉన్నారు. మరో 25 రోజుల్లోనే ఈ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మేరకు ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు బన్నీ. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజా హెగ్డేకి సంబంధించిన మ్యాటర్‌ లీక్‌ చేశాడు బాలయ్య. ఆమె పేరెత్తి బన్నీని కంగారు పెట్టించాడు. రష్మిక, పూజా హెగ్డేల పేర్లు చెప్పి ఐకాన్‌ స్టార్‌లో కలవరం పెట్టించాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అల్లు అర్జున్‌, పూజా హెగ్డేలు కలిసి రెండు సినిమాలు చేశారు. `డీజే`తోపాటు ఇటీవల `అలా వైకుంఠపురములో`లో ఇద్దరు కలిసి నటించారు. `డీజే` బాగానే ఆడగా, `అల వైకుంఠపురములో` సినిమా పెద్ద విజయం సాధించింది. ఓ రకంగా బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించడం విశేషం.

దీంతోనే బన్నీ తన రేంజ్‌ని పెంచుకున్నాడు. భారీ సినిమాలతో రాబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాలతోనే అల్లు అర్జున్‌, పూజా హెగ్డేల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. బెస్ట్ పెయిర్‌గానూ నిలిచింది. నెక్ట్స్ చేయబోతున్న త్రివిక్రమ్‌ సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌ అనే టాక్‌ కూడా వినిపించింది. 
 


photo credit-aha unstoppable4 promo

ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య ఓ కొత్త విషయాన్ని లీక్‌ చేయడం ఆశ్చర్యంగా మారింది. తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌ స్టాపబుల్ 4 షోలో అల్లు అర్జున్‌ పాల్గొన్నారు. మొదటి సీజన్‌లో `పుష్ప` ప్రమోషన్స్ కోసం గెస్ట్ గా కాసేపు మెరిశారు బన్నీ. ఇప్పుడు మరోసారి ఆయన ఈ షోకి వచ్చారు. అయితే ఈ సారి చాలా విషయాలు డిస్కస్‌ చేసుకున్నారు.

సినిమాలు, కెరీర్‌కి సంబంధించిన విషయాలు, ఫ్యామిలీతోపాటు హీరోయిన్లతో అనుబంధాలు, చిరంజీవితో అనుబంధం, మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, పలు ఫన్నీ సన్నివేశాలను పంచుకున్నారు. ఈ కన్వర్జేషన్‌లో పూజా హెగ్డే, రష్మిక మందన్నాల టాపిక్‌ తీసుకొచ్చాడు బాలయ్య. రష్మిక మందన్నాతో కంటే పూజా హెగ్డేతోనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడతావటగా? అని బాలయ్య అడుగుతూ బన్నీని గిచ్చే ప్రయత్నం చేశాడు.

పూజా హెగ్డే కాదు రష్మిక మందన్నాతోనే చేస్తానని చెప్పాడు బన్నీ. అయితే పూజా హెగ్డే పేరు చెప్పగానే బన్నీలో కొంత అయోమయం, ఇంకొంత టెన్షన్‌ కనిపించినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇది హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత దాన్ని కవర్‌ చేస్తూ నాక్కూడా రష్మిక మందన్నానే అని బన్నీ చెప్పడం విశేషం. ఇదంతా సరదా కన్వర్జేషన్‌.
 

photo credit-aha unstoppable4 promo

అనంతరం బన్నీ అమ్మ నిర్మలమ్మ కూడా షోకి వచ్చారు. కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. ఇందులో భాగంగా చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా? అని ప్రశ్నించగా, ఎప్పుడు కొట్టలేదు, దేనితో కొట్టేలేదో చెప్పండి అంటూ బన్నీనే ముందుగానే హింట్‌ ఇచ్చేశాడు, అన్ని రకాలుగా దెబ్బలు తిన్నట్టుగా వెళ్లడించాడు. అన్ని రకాలు వెపన్స్ వాడినట్టు తెలిపారు బన్నీ. అన్ని వెపన్స్ ట్రైన్‌ ఇలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నట్టు చెప్పాడు బన్నీ. అనంతరం ఏ వెపన్‌ వల్ల మారావు అనుకోవచ్చు అని అడగ్గా, స్నేహా రెడ్డి అనే వెపన్‌ వల్ల అని చెప్పడంతో షో మొత్తం దద్దరిల్లింది.

నిర్మలమ్మని బన్నీ బాధలో ఉన్నప్పుడు మీరు ఓదార్చారా? అని అడగ్గా కాస్త ఎమోషనల్‌గా కనిపించారు బన్నీ తల్లి. ఇక ప్రారంభంలో రొమాన్స్ ఇష్టమా? యాక్షన్‌ ఇష్టమా అని బాలయ్య అడగ్గా, నిజం చెప్పనా? తొక్కలో యాక్షన్‌ ఎవరికి కావాలి సర్‌ అంటూ రెచ్చిపోయాడు ఐకాన్‌ స్టార్‌. రొమాన్స్ కే ప్రయారిటీ ఇస్తానని వెల్లడించారు. 
 

photo credit-aha unstoppable4 promo

ఇక ఇందులో చిరంజీవి గురించి, చాలా పెద్ద ఫ్యామిలీ అయిన తమని కేర్‌ తీసుకోవడానికి సంబంధించి మాట్లాడారు బన్నీ. మహేష్‌ బాబు కమ్‌ బ్యాక్‌ కావాలని కోరుకున్నారు. మనిద్దరం రిలేటివ్స్ అని, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, నువ్వు అర్జునుడివి అని చెప్పగా, మీరు గీత ఇవ్వండి, నేను కురుక్షేత్రం చేస్తానని బన్నీ చెప్పడం నవ్వులు పూయించింది. పార్టీ లేదా పుష్ప అంటే మీ మాన్షన్‌లో హౌజ్‌ పార్టీ అని తెలిపాడు బన్నీ.

అలాగే జాతీయ అవార్డుకి సంబంధించి స్పందిస్తూ, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ అవార్డు రాలేదని, అదే తన మనసులో ఉందని, దాన్ని రౌండప్‌ చేసి కొట్టానని తెలిపారు. అలాగే మీరు `పుష్ప 3` చేయండి, నేను `అఖండ 3` చేస్తానని బన్నీ చెప్పడం, ఇద్దరు కలిసి పుష్ప స్టయిల్‌లో నడుచుకుంటూ రావడం ఆకట్టుకుంది. హైలైట్‌గా నిలిచింది.

అయితే పవన్‌ కళ్యాణ్‌తో వివాదం విషయాన్ని ఈ ఎపిసోడ్‌లో చర్చించలేదు. దానికి మరో ఎపిసోడ్‌ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్‌ ఈ నెల 15న ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. రెండో ఎపిసోడ్‌ ఆ తర్వాత వారం రాబోతుందని తెలుస్తుంది. 

Read more: కలర్‌ తక్కువ అంటూ శోభన్‌బాబుని అవమానించిన జయలలిత తల్లి, ప్రతీకారంగా సోగ్గాడు ఏం చేశాడో తెలుసా?

Also read: నక్కలు, పిచ్చికుక్కలు ఓట్‌ చేస్తే టేస్టీ తేజని పనిష్‌ చేస్తారా? నాగార్జున, బిగ్‌ బాస్‌పై ట్రోల్స్

Latest Videos

click me!