పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఆదివారం నిర్వహించారు. మహబలిపురంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో గల వెల్‌కమ్ హోటల్‌లో ఈ వెడ్డింగ్ జరిగింది.
కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రులతో ఈ వివాహ వేడుకని నిర్వహించారు శంకర్, ఈశ్వరీ దంపతులు.
ఇందులో తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నూతన వధువరులను ఆశీర్వధించారు.
దీంతోపాటు ప్రత్యేకంగా ఓ రిసెప్షన్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు శంకర్. సినీ ప్రముఖుల కోసం ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.
ఇక శంకర్ కూతురు ఐశ్వర్య డాక్టర్‌గా పనిచేస్తుంది. రోహిత్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో క్రికెటర్‌గా రాణిస్తున్నారు.