కన్నీళ్లు ఆపుకోలేకపోయా... సెల్వరాఘవన్ జీవితంలో ఏం జరుగుతోంది?

Published : Jan 29, 2026, 10:21 PM IST

Selvaraghavan: దర్శకుడు సెల్వరాఘవన్ తన భార్య నుంచి విడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపుతోంది.

PREV
14
Selvaraghavan Viral Video

దర్శకుడు సెల్వరాఘవన్, భార్య గీతాంజలి విడిపోయారని, మనస్పర్థల వల్లే ఆమె తన ఇన్‌స్టా నుంచి ఫోటోలు తీసేసిందని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.

24
సెల్వరాఘవన్ ఏం మాట్లాడారు?

చాలా రోజులుగా చెప్పాలనుకున్నా. ఇది నాకు మాత్రమే కాదు, కోట్లాది మందికి జరిగింది. మన జీవితంలో ఏది ఎలా జరగాలో దేవుడు ముందే నిర్ణయిస్తాడు. సంతోషమైనా, విషాదమైనా ముందే రాసిపెట్టి ఉంటుంది.

34
దేవుడు నిర్ణయించాడు

3 ఏళ్ల క్రితం నా జీవితంలో తట్టుకోలేని ఓ సంఘటన జరిగింది. కన్నీళ్లు ఆగలేదు. కానీ ఆ సంఘటన నన్ను బలవంతుడిని చేయడానికే అని తర్వాత తెలిసింది. అందుకే ఏది జరిగినా దేవుడి నిర్ణయమే.

44
గందరగోళంలో అభిమానులు

విడాకులు దేవుడి నిర్ణయమే అని సెల్వరాఘవన్ చెబుతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. 2011లో గీతాంజలిని పెళ్లాడారు. ఈమె రెండో భార్య. మొదటి భార్య సోనియా అగర్వాల్‌తో విడాకులు అయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories