డాషింగ్ హీరో సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ‘యానిమల్‘ చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. అయితే ఆయన ఓ మ్యూజిక్ డైరెక్టర్ పై మాట్లాడిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
అలాగే ‘సిద్ధార్థ్ రాయ్‘ (Siddharth Roy) మూవీ డైరెక్టర్ యెశస్వి (Yeshasvi) కూడా అదే మ్యూజిక్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వల్ల ఎంతలా ఇబ్బంది పడ్డారో చెప్పుకొచ్చారు.
సందీప్ రెడ్డి వంగ గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.... ’నేను ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ వదిలేస్తే ఏం చేస్తావు.. నేను వదిలేశాను కూడా’ అంటూ ‘అర్జున్ రెడ్డి’కి సంగీతం ఇచ్చిన రాధన్ (Radhan) కామెంట్స్ చేశారంట.
అయితే అదే రాధన్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమా దర్శకుడు యేశస్వి (Yeshsavi) కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు.
ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ను మధ్యలోనే వదిలేస్తారని సందీప్ రెడ్డి వంగ చెబితే... దర్శకుడు యేశస్వి మాత్రం ఆయన చాలా సోదీగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ సంగీత దర్శకుడు గొడవ పడటం కోసమే మాట్లాడుతుంటారని చెప్పుకొచ్చారు. ఇద్దరు డైరెక్టర్లకు దమ్కీ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇక మున్ముందు అవకాశాలు కష్టమే అంటున్నారు.