ప్రభాస్, నాగార్జునతో నటించి చిరాకు పుట్టిందట..కోపం కక్కేస్తూ 20 ఏళ్ళ తర్వాత మన్మథుడు హీరోయిన్ కామెంట్స్

First Published | Feb 22, 2024, 10:21 PM IST

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కొంతమంది హీరోయిన్లకు సరైన హిట్స్ లేనప్పటికీ స్టార్ హీరోయిన్లు అయిపోతారు. మరి కొంతమంది హీరోయిన్లు బిగినింగ్ లోనే హిట్ కొట్టినప్పటికీ వాళ్ళ కెరీర్ రెండు మూడు చిత్రాలకే ముగిసిపోతుంది.

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కొంతమంది హీరోయిన్లకు సరైన హిట్స్ లేనప్పటికీ స్టార్ హీరోయిన్లు అయిపోతారు. మరి కొంతమంది హీరోయిన్లు బిగినింగ్ లోనే హిట్ కొట్టినప్పటికీ వాళ్ళ కెరీర్ రెండు మూడు చిత్రాలకే ముగిసిపోతుంది. అలాంటి కోవకి చెందిన హీరోయిన్ అన్షు అంబానీ. అన్షు అంబానీ ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగింది. 

కానీ ఆమె కుటుంబ నేపథ్యం ఇండియానే. అందుకే టీనేజ్ వయసులోనే ఇండియాలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. 16 ఏళ్ల వయసులోనే అన్షు అంబానీ ప్రభాస్ సరసన రాఘవేంద్ర చిత్రంలో.. కింగ్ నాగార్జునకి జోడిగా మన్మథుడులో నటించింది. మన్మథుడులో నాగార్జున తో కలసి బాగానే రొమాన్స్ పండించింది. 


కుర్రాళ్ళు కూడా ఆమె యంగ్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ కి ఫిదా అయ్యారు. రెండు చిత్రాలు హిట్స్ కావడంతో తప్పకుండా అన్షు అంబానీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె సడెన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె కెరీర్ కేవలం రెండు మూడు చిత్రాలతోనే ముగిసిపోయింది. 

పెళ్లి తర్వాత అన్షు అంబానీ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం తళుక్కున మెరిసేది. అయితే దాదాపు 20 ఏళ్ళ తర్వాత అన్షు అంబానీ మీడియా ముందుకు వచ్చింది. తాను సినిమాలు మానేయడానికి కారణం పెళ్లి కాదని అన్షు తెలిపింది. ఈ క్రమంలో ఆమె టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు షాకింగ్ అనిపించేలా ఉన్నాయి. 

లోపల టాలీవుడ్ పై అన్షు ఇంత కోపం దాచుకుందా అనిపించక మానదు. తాను సినిమాలు ఎందుకు మానేయాల్సి వచ్చిందో అన్షు వివరించింది. రాఘవేంద్ర, మన్మథుడు రెండు చిత్రాల్లో నాకు చనిపోయే పాత్ర ఇచ్చారు. ఆ రెండు చిత్రాలతోనే నాకు చిరాకు పుట్టింది. అది చాలదు అన్నట్లు ఆ తర్వాత వచ్చిన ఆఫర్స్ కూడా చనిపోయే పాత్రలే. 

అలాంటి పాత్రల్లో చాలా బాగా చేస్తున్నారు అంటూ అవే తీసుకొచ్చేవారు. పదే పదే అలాంటి రోల్స్ ఆఫర్ చేయడంతో విసుగెత్తిపోయాను. ఏ నటికైనా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. ఒకే రకమైన పాత్రలు చేయడం కంటే సినిమాలు మానేయడం బెటర్ అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్షు పేర్కొంది. 

Latest Videos

click me!