మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కీర్తి పొందుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయనకు ఎంతటి క్రేజ్ పెరిగిందో తెలిసిందే. దీంతో చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనా గట్టిగా అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ఓల్డ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ ను ఓ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫిదా చేయడమే అందుకు కారణం.
మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky bhagnani) తాజాగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో పాటు రామ్ చరణ్ రకుల్ పై చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే రామ్ చరణ్ - రకుల్ ప్రీత్ జంటగా ‘బ్రూస్ లీ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే..
అప్పట్లో రామ్ చరణ్ రకుల్ ప్రీత్ ను ఓ విషయంలో మెచ్చుకున్నారు. బ్రూస్ లీ సినిమాలో రకుల్ ‘పరేషాన్ రా’ అనే సాంగ్ కు ఇచ్చిన పెర్పామెన్స్ కు చరణ్ ఫిదా అయ్యారని చెప్పారు. అంతే కాదు ఎందుకు ఖుషి అయ్యారో కూడా చెప్పారు.
థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అభిమాని ఒకరు రకుల్ ప్రీత్ పెర్ఫామెన్స్ కు ఎమోషనల్ అయ్యి చొక్కా చింపుకోవడం చరణ్ కు ఆసక్తికరంగా మారిందని చెప్పారు. రకుల్ నుంచి ఫస్ట్ టైం అలాంటి పెర్ఫామెన్స్ వచ్చిందని చరణ్ మెచ్చుకున్నారు. నిజానికి ఆ సాంగ్ ఇప్పటికీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది.