Chiranjeevi: చిరంజీవి కోసమే తీసిన సినిమా, అభిమానుల బాధ ఇదే..ముందుగా రిలీజై ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు

Published : Aug 10, 2026, 04:04 PM IST

సింహరాశి, మహానంది లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ సముద్ర చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కోసం మరో హీరోతో ఆయన చేసిన సినిమా గురించి ప్రస్తావించారు.

PREV
15
Chiranjeevi

డైరెక్టర్ సముద్ర సింహరాశి, మహానంది, శివరామాంజు లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించారు. సముద్ర తెరకెక్కించిన చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించేవి. సముద్ర తన కెరీర్ లో రాజశేఖర్, జగపతి బాబు, హరికృష్ణ, సుమంత్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలతో సినిమాలు చేశారు. సముద్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అగ్ర హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
రీమేక్స్ చేయను అని తేల్చేసిన మహేష్

సముద్ర తన కెరీర్ బిగినింగ్ లో మహేష్ బాబుతో కూడా సినిమా చేయాలని ప్రయత్నించారట. సముద్ర మాట్లాడుతూ.. కథ అద్భుతంగా ఉందని నిర్మాతలని రెడీ చేసుకోమని మహేష్ బాబు చెప్పారు. కానీ ఆ కథకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు అన్నారు. ఏదైనా రీమేక్ సినిమా చేద్దాం అని అంటే.. తనకు రీమేక్స్ చేయడం ఇష్టం లేదు అని మహేష్ బాబు అప్పట్లోనే తేల్చి చెప్పేశారు.

35
చిరంజీవి, బాలయ్యతో సినిమాకి ప్రయత్నం

ఆ తర్వాత బాలయ్య బాబుతో కూడా సినిమా చేయాలని ప్రయత్నించా. వర్కౌట్ కాలేదు. చిరంజీవి గారిని కూడా అడిగా. ఆయన మంచి సబ్జెక్ట్ కుదిరితే తప్పకుండా చేద్దాం అని అన్నారు. కానీ కథ కుదర్లేదు. చిరంజీవి గారు పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఆయనపై మంచి సినిమా చేయాలని అనుకున్నా. ఆయన అభిమానిని నేను. దీనితో జగపతి బాబుతో అధినేత అనే సినిమా చేశాం. అది చిరంజీవి గారిని ఉద్దేశించి చేసినదే అని అందరికీ తెలుసు.

45
చిరంజీవిని ఊహించుకుని ఆ సినిమా చేశా

చిరంజీవి గారు సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది ఊహించుకుని ఆ సినిమా చేశాం. సరిగ్గా అదే టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడం కరెక్ట్ కాదు అని సెన్సార్ వాళ్ళు సెన్సార్ క్లియర్ చేయలేదు. దీనితో ఎన్నికలు అయ్యాక రిలీజ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అధినేత సినిమా చూసి చిరంజీవి అభిమానులు ఒకటే గొడవ. వాళ్ళు చాలా బాధపడ్డారు. సార్ ఈ సినిమా ఎన్నికలకు ముందు రిలీజ్ చేసి ఉండొచ్చు కదా. చిరంజీవి గారికి బాగా మైలేజీ వచ్చేసి అని నా ముందు వాపోయారు.

55
ఎన్నికలపై ప్రభావం

ఎన్నికల ముందు రిలీజ్ అయివుంటే ఈ సినిమా వల్ల రిజల్ట్స్ పై ఎంతో కొంత ప్రభావం ఉండేది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే దక్కాయి.

Read more Photos on
click me!

Recommended Stories