Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్

Published : Oct 11, 2026, 05:23 PM IST

చిరంజీవి నటించిన ఓ ఫ్లాప్ మూవీకి పోటీగా భానుచందర్ నటించిన సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల టైటిల్స్ ఒకే తరహాలో ఉంటాయి. దీని గురించి డైరెక్టర్ సాగర్ ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Chiranjeevi

చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చాక చిన్న చిన్న పాత్రలు ఉన్న సినిమాల్లో సైతం నటిస్తూ గుర్తింపు పొందారు. ఒక్కసారి చిరంజీవికి గుర్తింపు వచ్చాక నిర్మాతలకు, దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారారు. చిరంజీవితో సినిమా చేస్తే మినిమమ్ లాభాలు గ్యారెంటీ అని నిర్మాతలంతా ఆయన వెంట పడేవారు. ఈ విషయాన్ని దివంగత దర్శకుడు సాగర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

25
ఆ సినిమాకు 3 నంది అవార్డులు

సాగర్ గురించి పరిచయం అవసరం లేదు. నరేష్ రాకాసి లోయ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్టువర్టుపురం దొంగలు, రామసక్కనోడు లాంటి సూపర్ చిత్ర చిత్రాలు తెరకెక్కించారు. సుమన్ హీరోగా నటించిన రామసక్కనోడు చిత్రం ఏకంగా 3 నంది అవార్డులు గెలుచుకుంది. రాకాసి లోయ తర్వాత నరేష్ తో సాగర్ మరోసారి సినిమా చేశారు. ఆ మూవీ టైటిల్ 'మా వారి గోల'. హీరోయిన్ గా మనో చిత్ర నటించింది.

35
7 లక్షలు వంద కోట్లతో సమానం, ఊహించని నష్టం

ఆ సినిమాకి తాను దర్శకుడినే అయినప్పటికీ 7 లక్షల వరకు సొంత పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చింది అని సాగర్ అన్నారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. నా 7 లక్షలు పోయాయి. అప్పట్లో 7 లక్షలు.. అదే డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 100 కోట్లు అయ్యేవి. చాలా దారుణమైన స్థితికి చేరుకున్నా. ఇక జీవితంలో దర్శకత్వం చేయకూడదు అని ఫిక్స్ అయ్యా. నష్టపోయి ఉన్నాను కాబట్టి ఆ నష్టాల నుంచి బయటపడాలన్నా, లాభాలు పొందాలి అన్నా చిరంజీవితో సినిమా చేయడం ఒక్కటే మార్గం అనిపించింది. అప్పట్లో చిరంజీవి సినిమాకు నిర్మాతలకు రూ. 5 కోట్ల వరకు లాభాలు వచ్చేవి.

45
సాగర్ కి భరోసా ఇచ్చిన చిరంజీవి

చిరంజీవితో సినిమా చేయలేదు కానీ పరిచయం ఉంది. వెళ్లి నాకు సినిమా చేయాలని అని రిక్వస్ట్ చేశా. తప్పకుండా చేస్తాను. కానీ ఇప్పుడు కాదు చాలా బిజీగా ఉన్నా. ప్రజెంట్ ఉన్న కమిట్మెంట్స్ అయ్యాక నీకు సినిమా చేస్తా. కానీ నీ ఒక్కడికే చేయను. సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావులకు ఒక సినిమా చేశా. లాభాల్లో వాటా ఇచ్చాను. అదే విధంగా నీకు కూడా ఒక సినిమా చేస్తాను, లాభాల్లో వాటా ఇస్తాను అని అన్నారు.

55
ఒకే తరహా టైటిల్ తో చిరంజీవిని దెబ్బ కొట్టిన సాగర్

దీనితో చిరంజీవితో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నా. నా టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంతలోపు ఒక సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ టైటిల్ స్టువర్టుపురం దొంగలు. భానుచందర్ హీరో. అదే సమయంలో చిరంజీవి గారు యండమూరి వీరేంద్రనాథ్ తో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ అనే సినిమా చేస్తున్నారు. టైటిల్స్ ఒకేలా ఉండడంతో ఇండస్ట్రీలో చర్చ మొదలయింది. చిరంజీవి గారు ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఒకరిని పిలిచి మా సినిమా కథ మొత్తం చెప్పాను. మీ సినిమా కథ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మా కథ ఇది. చిరంజీవి గారికి ఈ కథ చెప్పండి. ఎక్కడైనా ఒకేలా అనిపిస్తే ఆ సీన్ ని వెంటనే తొలగిస్తాం అని చెప్పా. చిరంజీవి గారి సినిమా ముందుగా రిలీజ్ అయింది. ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. నాలుగు రోజుల తర్వాత విడుదలైన మా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఒకే తరహా టైటిల్, పైగా మా సినిమా హిట్..అయినా కూడా చిరంజీవి గారు ఫీల్ కాలేదు. బహుశా ఆయనతో సినిమా నిర్మిస్తాను అని చెప్పి నేను సొంతంగా సినిమా చేసుకోవడంపై ఆయన ఫీల్ అయి ఉండొచ్చు. అప్పటి నుంచి నాకు ఆయనకు గ్యాప్ పెరిగింది అని సాగర్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories