Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..

Published : Mar 20, 2026, 07:28 PM IST

Chiranjeevi: తెలుగులో క్లాసిక్ కామెడీ మూవీగా నిలిచిన 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' చిత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలను దర్శకుడు రాజా వన్నెంరెడ్డి పంచుకున్నారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్, మెగాస్టార్ చిరంజీవి నటనలోని.. 

PREV
15
క్లాసిక్ కామెడీ 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి'

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు, ముఖ్యంగా కామెడీ సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 26 సంవత్సరాల క్రితం విడుదలై ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తున్న సినిమా 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి'. ఈ చిత్ర దర్శకుడు రాజా వన్నెంరెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఈ సినిమా వెనుక ఉన్న రహస్యాలను వెల్లడించారు.

25
సినిమా ప్రారంభం, ఎడిటర్ మోహన్ సహకారం

ఈ సినిమా క్రెడిట్ అంతా నిర్మాత, ఎడిటర్ మోహన్‌కే దక్కుతుందని రాజా వన్నెంరెడ్డి తెలిపారు. మోహన్ తన సొంత కొడుకు(జయం రవి) కంటే ముందే తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారని, ఆ ఫ్యామిలీకి తాను రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలను(శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం), ఇతర తారాగణాన్ని ఎంపిక చేసింది కూడా మోహన్ అని చెప్పుకొచ్చారు.

35
రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ పాత్రలు

ఆ సమయంలో టాప్ హీరోయిన్‌గా ఉన్న రమ్యకృష్ణ ఈ సినిమాలో ఒక చిన్న కానీ కీలకమైన పాత్ర చేయడానికి అంగీకరించడం విశేషం. సినిమా కథ, తన క్యారెక్టర్ లోని డెప్త్ నచ్చి ఆమె ఈ సినిమాలో నటించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంట ఈ సినిమాలో మిగిలిన మూడు జంటలను దారిలో పెట్టే పాత్రల్లో కనిపిస్తారన్నది తెలిసిందే.

45
బ్రహ్మానందం - కోవై సరళ కామెడీ మ్యాజిక్

ఈ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్రహ్మానందం, కోవై సరళల అద్భుతమైన కామెడీ. బ్రహ్మానందం మొదట ఈ పాత్ర చేయడానికి కొంత సంకోచించినా, ఆ తర్వాత తనదైన శైలిలో పరకాయ ప్రవేశం చేశారు. కోవై సరళకి తెలుగు రాకపోయినా, ఆమె డైలాగులను తమిళ్‌లో రాసుకుని, దర్శకుడు చెప్పిన టైమింగ్‌ను పట్టుకుని అద్భుతంగా నటించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

55
చిరంజీవి కామెడీ టైమింగ్

కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఆకాశానికెత్తారు. ఇండస్ట్రీలో 1 నుంచి 10 వరకు కామెడీ టైమింగ్‌లో చిరంజీవి ఫస్ట్ అని, ఆయన పంచ్ డైలాగులు, ఎక్స్‌ప్రెషన్లు పండించడంలో దిట్ట అని కొనియాడారు. కామెడీ అనేది స్వతహాగా రావాలని, నేర్పించి చేయించేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Read more Photos on
click me!

Recommended Stories