Radhe Shyam: జాతకాలపై ప్రభాస్ అభిప్రాయం ఏంటి.. మనకు అర్థం కాకపోతే అబద్ధమేనా ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 02, 2022, 10:01 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమాదకరంగా మారుతున్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనవరి 7న విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడింది. దీనితో రాధేశ్యామ్ చిత్రం కూడా వాయిదా పడుతుందని అంతా భావించారు. 

PREV
16
Radhe Shyam:  జాతకాలపై ప్రభాస్ అభిప్రాయం ఏంటి.. మనకు అర్థం కాకపోతే అబద్ధమేనా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమాదకరంగా మారుతున్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనవరి 7న విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడింది. దీనితో రాధేశ్యామ్ చిత్రం కూడా వాయిదా పడుతుందని అంతా భావించారు. అయితే రాధే శ్యామ్ విడుదలకు ప్రస్తుత పరిస్థితులు అడ్డు కాబోవని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. 

 

26

ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంటే చేతి గీతలని బట్టి వారి భవిష్యత్తుని అంచనా వేసే విద్య. ప్రపంచంలో ఎవ్వరి భవిష్యత్తు అయిన వారి చేతి రాతలు చూసి విక్రమాదిత్య ఇట్టే చెప్పేస్తాడు. ప్రభాస్ పాత్రని విధి రాతకి, ప్రేమకి లింక్ పెడుతూ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చేతి రాతలు చూసి భవిష్యత్తు చెప్పడం ఒకరకంగా జ్యోతిష్యం, జాతకులకు సంబంధించినదే. 

 

36

ఇక ప్రభాస్ రియల్ లైఫ్ లో జాతకాలు నమ్ముతాడా అని రాధాకృష్ణని ప్రశ్నించగా.. అది ప్రభాస్ ని అడిగి తెలుసుకుంటేనే బావుంటుంది అని అన్నారు. ఇక జాతకాలు, జ్యోతిష్యం నిజామా అబద్దమా అని ప్రశ్నించగా.. అవి అబద్దం అయితే ఇన్నివేల సంవత్సరాలు కోనసాగవు. మనకు అర్థం కానీ ప్రతి విషయం అబద్దం కాదు. 

 

46

మనకు తెలియనివి, నమ్మలేనివి, అర్థం కానీ విషయాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. మనకు తెలిసిన వాటిని మాత్రమే కరెక్ట్ అని.. తెలియనివాటిని తప్పు అని వాదించడం అలవాటైపోయింది అని రాధాకృష్ణ అన్నారు. దేవుడు, అంతరిక్షం, జాతకం లాంటి ప్రశ్నలు మనిషి దగ్గర నుంచే పుడతాయి అని రాధాకృష్ణ అన్నారు. 

 

56

జాతకాలపై తన పూర్తి అభిప్రాయం ఏంటనేది సినిమా చూసే తెలుసుకోవాలని రాధా కృష్ణ అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం చూశాక పూజా హెగ్డే కెరీర్ ని రాధే శ్యామ్ కి ముందు.. ఆ తర్వాత అని అంటరాని దర్శకుడు తెలిపారు. 

 

66

విధిరాతకి, ప్రేమకి మధ్య జరిగిన యుద్ధంలో ఏది విజయం సాధించింది అనే ఉత్కంఠతో ఈ చిత్రం ఉండబోతోంది. ట్రైలర్ లో సన్నివేశాలు కూడా అలాగే చూపించారు. Also Read: Pragya Jaiswal: బాలయ్య భామ ప్రగ్యా బోల్డ్ అటెంప్ట్..రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ పోజులిచ్చిన హాట్ బ్యూటీ

Read more Photos on
click me!

Recommended Stories