ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న ఆగష్టు 15న ప్రశాంత్ నీల్ ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంకి చెందిన నీలకంఠాపురంని సందర్శించారు. ప్రశాంత్ నీల్ సొంత గ్రామం అదే. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి ఆయా గ్రామంలో పుట్టి పెరిగిన వారే. అంతే కాదు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డికి సుభాష్ రెడ్డి సోదరుడు అవుతారు. అంటే ప్రశాంత్ నీల్ రఘువీరాకు అన్న కొడుకు వరుస.