షాకింగ్ న్యూస్.. విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ ప్రియమణి...? కారణమేంటి...?

First Published | Aug 16, 2022, 9:22 AM IST

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. ఈమధ్యలోనే రెండు స్టార్ కపుల్స్ డివోస్స్ తీసుకుని వివాహ బంధానికి స్వస్తి పలికారు.ఇక త్వరలో మరోజంట విడాకులకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  
 

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య  ఎక్కువుగా విడాకుల జంటలు పెరుగుతున్నాయి. యంగ్ కపుల్ అని.. సీనియర్ కపుల్స్ అని లేదు.. వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఎంతో అభిమానించే తమ స్టార్స్ వీడాకులు తీసుకోవడంతో.. ఫ్యాన్స్ గుండెలు బద్దలవుతున్నాయి. ఇక ప్రియమణి కూడా ఈ లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. 

యంగ్ కపుల్స్ నుండి..సీనియర్ హీరోల వరకు ఇప్పటికే చాలామంది తారలు విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 
 


హీరోయిన్ ప్రియమణి తన భర్త ముస్తాఫా కు డివోర్స్ ఇవ్వబోతున్నట్టు..న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వీళ్లకి పెళ్లై కొన్నేళ్లు అవుతోంది. అయితే చాలా కాలం అవుతున్నా వీరికి  పిల్లలు లేరు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. 

అయితే ఈ విషయంలో ప్రియమణి మాత్రమే ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారట. కెరీర్ లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కనాలి అని ఆమె అనుకుంటుందట. . దీని కారణంగానే వీళ్ల మధ్య గొడవలు అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో ప్రియమణి మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు.  

టాలీవుడ్ లో హీరోయిన్ గా  స్టార్ హీరోల సరసన ఆడిపాడింది  ప్రియమణి. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన టైమ్ లో ముస్తఫా  అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది ప్రియమణి. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటీ అంటే.. ఆయనకు ఇంతకు ముందే పెళ్ళి అయ్యింది. కానీ,, ముస్తఫాను ప్రియమణి ప్రేమించడం వల్ల  ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 
 

ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్  సోషల్ మీడియలో తెగా ట్రెండ్ అయ్యింది. ప్రియమణి  ముస్తాఫ ఫస్ట్ వైఫ్  బెదిరింపులకు కూడా పాల్పడిదన్నారు. కేసులు పెడతామని కూడా అన్నట్టు మాటలు వినిపించాయి. కాని వాటికి హీరోయిన్  ప్రియమణి ఏ మాత్రం లొంగ లేదు భయపడలేదు. తన పని తాను చేసుకుంటూముందుకు వెళ్తోంది. 

ఇక ఆ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి.. బుల్లి తెర షోస్ తో పాపులర్ అయ్యింది. ఆతరువాత వెండితెరపై కూడా  మంచి మంచి ఆఫర్స్ వస్తుండటంతో.. స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. ఇక ప్రియమణి ..తన వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నట్లు వస్తున్న వార్తలపై  ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Latest Videos

click me!