ఆదిపురుష్ రిజల్ట్... ప్రభాస్ పై ఆదిపురుష్ డైరెక్టర్ సంచలన కామెంట్స్!

Published : Jun 19, 2023, 06:33 PM IST

ఆదిపురుష్ టీజర్ విడుదల నాటి నుండి దర్శకుడు ఓం రౌత్ తీవ్రమైన క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారు. మూవీ విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓం రౌత్ మరింతగా విమర్శల పాలయ్యాడు. కాగా ఓం రౌత్ హీరో ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.   

PREV
15
ఆదిపురుష్ రిజల్ట్... ప్రభాస్ పై ఆదిపురుష్ డైరెక్టర్ సంచలన కామెంట్స్!

ఓం రౌత్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రభాస్ అంత ఈజీగా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. లాక్ డౌన్ సమయంలో ప్రభాస్ కి కాల్ చేశాను. రామాయణ గాథ చేస్తున్నామని చెప్పాను. నువ్వు నా నుండి ఈ పాత్ర ఆశిస్తున్నావని అడిగాడు. రాముడు అని చెప్పాను. నువ్వు సీరియస్ గానే ఈ మాట అంటున్నావా? అన్నారు. అవును మీరు రాముడిగా నటించాలని చెప్పాను. మరి స్క్రిప్ట్ ఎలా చెబుతావు. జూమ్ కాల్ లో స్క్రిప్ట్ నేరేట్ చేయడం సాధ్యం కాదు కదా అన్నారు. 
 

25

నేను వెంటనే హైదరాబాద్ లో వాలిపోయాను. కథ వినిపించాను. ఆయన ఇంప్రెస్ అయ్యారు. అప్పటి నుండి నాకు సపోర్ట్ గా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన సపోర్ట్ నాకు ఉంటుందని భావిస్తున్నాను. ఆదిపురుష్ లో రాముడు అంటే ప్రభాస్ మాత్రమే నా మదిలో మెదిలాడు. ఆయన కోసమే ఇది రాసుకున్నాను. 
 

35

యుద్ధకాండలో రాముని పాత్ర వీరోచితంగా ఉంటుంది. అందుకే యుద్ధకాండ తీసుకున్నాను, అని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. మూడు రోజుల్లో మూడు వందలకు పైగా వసూళ్లు దక్కాయి. రాముడు సెంటిమెంట్, ప్రభాస్ మేనియా బాగా పని చేస్తుంది. 
 

45

ఓం రౌత్ భారీగా విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రావణుడు పాత్రకు ఆయన రాసిన సన్నివేశాలు, ఆయన గెటప్ ని హిందూ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే కొన్ని డైలాగ్స్ ని తప్పుబడుతున్నారు. నేపాల్ లో కూడా ఆదిపురుష్ వివాదాలు రగిలించింది. మూవీ విడుదలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. 
 

55


ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. లంకేశ్వరుడు పాత్ర సైఫ్ అలీ ఖాన్ చేశాడు. టి సిరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మించారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories