‘ప్లీజ్.. అందులోకి లాగకండి.. నాకు ఫ్యామిలీ ఉంది’.. వైరల్ గా మారిన అనసూయ కామెంట్లు

First Published | Jun 19, 2023, 5:34 PM IST

యాంకర్ అనసూయ మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గ్గా మారింది. నన్ను అలాంటి విషయాల్లోకి లాగొద్దు అంటూ వరుస ట్వీట్లతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్  వైరల్ గా మారాయి.
 

బుల్లితెరపై సందడి చేసిన యాంకర్ అనసూయ ప్రస్తుతం నటిగా వెండితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. బుల్లితెరకు దూరమైన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. 
 

సినిమా విషయాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే కొన్ని విషయాల్లోనూ అనసూయ అనవసరంగా కలుగజేసుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతుంటారు. ఆమె కామెంట్లతోనూ ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిగ్గానే మారుతుంటుంది.


తాజాగా మరోసారి బాంబ్ పేల్చింది. వరుస ట్వీట్లతో తన మనస్సులోని మాటను వెల్లగక్కింది. అనసూయ ట్వీట్ చేస్తూ.. అందరికి నమస్కారం.. నా నుంచి ఒక రిక్వెస్ట్. కొన్ని రోజుల నుండి నాకు చాలా ట్వీట్లు వస్తున్నాయి.. రాజకీయ, సినీ పరిశ్రమలో ఇతరులను అగౌరవపరిచేందుకు నా పేరును ఉపయోగిస్తున్నారు.. 
 

ఇది అగౌరవంగా ఉంది. ఈ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.  నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా  నడిపించేందుకు ప్రయత్నిస్తున్నానంతే. ఇదే నేను నేర్చుకున్నాను. కాబట్టి ఎవరి దారిలోకి నేను రావడం లేదు.  మీ అందరి ఒకటే అభ్యర్థన చేస్తున్నాను. నేను సెల్ఫ్ మేడ్ విమెన్ ని. ఈ విషయంలో నన్ను నమ్మండి.
 

నాకు పీఆర్ టీమ్ లేదు. అందుకే నేనే మీకు అన్ని విషయాలు చెబుతున్నాను. నన్ను ప్రొత్సహించడం మీకు ఇష్టం లేకపోతే నా నుంచి దూరంగా ఉండండి. అంతేగానీ ఏమాత్రం సంబంధం లేని విషయాల్లోకి నా పేరును లాగకండి. ఫ్లీజ్.. నాకూ ఫ్యామిలీ ఉందంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
 

అయితే, రీసెంట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.  ఆ తర్వాత అనసూయపై బాగా ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ‘విమానం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్ట్స్ ‘పుష్ఫ2’తో  అలరించబోతోంది. 
 

Latest Videos

click me!