బిగ్ బాస్ సీజన్ 7కు అంతా రెడీ.. మహూర్తం ఎప్పుడు..? హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరంటే..?

Published : Jun 19, 2023, 06:17 PM IST

గత ఆరుసీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఏడోవ సీజన్ కు రెడీ అవుతుంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో. మరి ఈసీజన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది.. ? కంటెస్టెంట్స్ఎవరూ..? 

PREV
16
బిగ్ బాస్ సీజన్ 7కు అంతా రెడీ.. మహూర్తం ఎప్పుడు..? హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరంటే..?

బుల్లితెర ఆడియన్స్ ను వేరే లెవల్లో ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్.  హిందీలో సూపర్ సక్సెస్ అయిన ఈ షో.. తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ఆరు సీజ‌న్స్ జ‌రుపుకుంది. అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి  సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్ రిజల్ట్ సాధించాలని చూస్తున్నారు. 

26

ఈసారి పక్కా వ్యూహంతో సీజన్ 7‌ని ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలని నిర్వాహ‌కులు ప్లాన్స్ చేస్తున్నారు. అందుకే ఈ సారి కొంత ఆల‌స్యంగానే సీజ‌న్ 7 ప్రారంభం కాబోతుంద‌ని టాక్. అంతే కాదు పేరున్న స్టార్స్ ను కాస్త రేటు ఎక్కువైనా.. హౌస్ లోకి తీసుకురావాలి అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. 
 

36
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ సీజ‌న్ 7 లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షో ఎప్ప‌టి మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా  హోస్ట్ గా కింగ్  నాగార్జున‌నే ఉంటారా... లేక గతంలో వినిపించిన పేర్లలో ఎవరైనా రావచ్చా అనేది ఉత్కంటగా మారింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ ను సూపర్ సక్సస్ చేయగా.. సెకండ్ సీజన్ లో నానీ అట్టర్ ప్లాప్ అయ్యారు. అప్పటి నుంచి నాలుగు సీజన్లు కింగ్ నాగార్జున హెస్ట్ గా చేయగా.. లాస్ట్ సీజన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. 

46
Bigg Boss Telugu 6

అటు ప్రోగ్రామ్ విషయంలో కూడా నాగ్ పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టినట్టు కనిపించలేదు. సీజన్ 5 కూడా కాస్త చప్పగానే సాగింది. దాంతో నాగ్ ఈ హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టువార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో మాత్రం తెలియదు. హోస్ట్‌గా నాగార్జున స్థానంలో బాల‌కృష్ణ‌ని తీసుకురాబోతున్నార‌ని.. అంటున్నారు. అంతే కాదు రానా, విజయ్ దేవరకొండ పేర్లు కూడా వినిపించాయి. 

56
Bigg Boss Telugu 6

ఇక అంతే కాదు హౌస్ లో కంటెస్టెంట్స్ గా.. వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని టాక్. అంతే కాదు కొత్త జంటలు కూడా ఈ లీస్ట్ లో ఉన్నట్టు సమాచారం. అమ‌ర్ దీప్ అత‌ని భార్య‌, యాంక‌ర్ దీపికా పిల్లి, యూట్యూబ‌ర్ నిఖిల‌, న‌టి ఐశ్వ‌ర్య‌, సింగ‌ర్ హేమ చంద్ర‌, డ్యాన్స‌ర్ శ్వేత నాయుడు, న‌టి మిత్రా శ‌ర్మ‌, న‌టి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండ‌ర్ త‌న్మ‌యి, మోడ‌ల్ సాయి రోన‌క్, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

66

అంతే కాదు  న్యూస్ రీడ‌ర్ ప్ర‌త్యూష‌, సింగర్ మోహ‌న భోగరాజు, యాంకర్ ర‌ష్మీ, క‌మెడీయన్ ర‌ష్మీ, సింగ‌ర్ మంగ్లీ, కామ‌న్ మ్యాన్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఇలా ప‌లువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7లో పాల్గొన‌బోతున్నార‌ని స‌మాచారం. ఈసారి పక్కాగా భారీ రేటింగ్ సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నారు టీమ్. అంతే కాదు ఈసీజన్ మళ్ళీ ప్లాప్ అయితే.. నెక్ట్స్ సీజన్ ఉంటుందో లేదో కూడా తెలియదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories