‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్‌కుమార్ ఒక్కసారి దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ‘జైలర్’ విజయం తర్వాత ఆయన నిర్మాతగా మారి తమిళంలో ‘బ్లడీ బెగ్గర్’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేసారు. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో కవిన్ హీరోగా నటించాడు.
ఈ సినిమా తెలుగులో డబ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న స్దాయిలో రెస్పాన్స్ రాలేదు. అలాగే తమిళంలో కూడా ఈ చిత్రం ఎక్కువ రేట్లు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం తెచ్చిపెట్టింది. ఈ నేపధ్యంలో రజనీకాంత్ దారినే ఎంచుకున్నారు నెల్సన్.