ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ

Published : Jan 06, 2026, 08:59 PM IST

Director Maruthi: డైరెక్టర్ మారుతి తన కుమార్తె హియా దాసరి 'ది రాజాసాబ్'లో పని చేసిందని తెలిపారు. రాజా సాబ్ చిత్రంలో జోకర్ గెటప్ ఆలోచన ఆమెదేనని, హీరో ప్రభాస్‌తో కూడా చర్చించామని తెలిపారు. చిన్నప్పటి నుంచి హియా మంచి ఆర్టిస్ట్ అని..  

PREV
15
ఆమెకు సినిమా పట్ల ఆసక్తి..

డైరెక్టర్ మారుతి తన కుమార్తె హియా దాసరి గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సినిమాల పట్ల ఆసక్తి ఉందని.. చాలా తెలివైనదని పేర్కొన్నారు. తనకు ఏమైనా చెబితే అడ్వాన్స్‌గా విషయాలు చెబుతూ ఉంటుందని తెలిపారు. ఆమెను తన ప్రతీ సినిమా షూటింగ్‌లోనూ వెంట తీసుకెళ్తానని చెప్పారు.

25
జోకర్ గెటప్ ఆలోచన ఆమెదే..

తాను వెంట తీసుకెళ్తే.. అలా ఒక దగ్గర ఉండిపోవడమే కాదని.. ఆమె ప్రతీ పనిలోనూ సహకారం అందిస్తుందని దర్శకుడు మారుతీ తెలిపారు. ఈ క్రమంలోనే, రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన జోకర్ గెటప్ ఆలోచన హియా దాసరిదేనని, హీరో ప్రభాస్‌తో కూడా ఆమె దీని గురించి కూర్చుని చర్చించిందని మారుతి వెల్లడించారు.

35
హియా మంచి ఆర్టిస్టు

చిన్నప్పటి నుంచే హియాకు సృజనాత్మక పునాది ఉందని.. ఆమె మంచి ఆర్టిస్ట్ అని మారుతి వివరించారు. బొమ్మలు వేయడంలో, ముఖ్యంగా జోకర్ చిత్రాలు గీయడం ఆమెకు పిచ్చి అని, ఇందుకోసం ఆమె పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించిందని గుర్తుచేసుకున్నారు. చిత్రలేఖనంతో పాటు ఫోటోగ్రఫీ పట్ల కూడా హియాకు అభిరుచి ఉందని ఆయన తెలిపారు.

45
రాజాసాబ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం..

ఈ సృజనాత్మక వల్ల రాజా సాబ్ లాంటి సినిమా ప్రాజెక్టులలో ఆమె భాగస్వామ్యాన్ని, అభిప్రాయాలను అందించగలిగిందని మారుతి అభిప్రాయపడ్డారు. తదుపరి తరం కూడా సినిమా రంగంలో బలమైన పిల్లర్‌గా ఉండాలనే ఆకాంక్షను దర్శకుడు మారుతీ పరోక్షంగా వ్యక్తం చేశారు.

55
జనవరి 9న థియేటర్లలోకి..

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ది రాజాసాబ్' చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ రూపొందించగా.. మాళవిక మోహనన్, రిధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories