ఒక్కోక్క సారి అనుభవం ఉన్న స్టార్ హీరోలు కూడా సినిమాల విషయంలో సరిగ్గా అంచనాలు వేయలేకపోతారు. అలాంటి పొరపాటు చేసి.. 1000 కోట్ల సినిమాను వదిలేసుకున్నాడు కింగ్ నాగార్జున.. అది కూడా ఓ ప్లాప్ సినిమా కోసం. ఇంతకీ ఏంటా రెండు సినిమాలు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా ఒక్కోసారి పప్పులో కాలేస్తుంటారు. రాంగ్ డెసిషన్స్ వల్ల గోల్డోన్ ఛాన్స్ లు మిస్ అవుతుంటారు. అయితే అది ఎంత పెద్ద సినిమా అయినా.. ఆ కథలో నటించడానికి మనసు ఒప్పుకోక వదిలేసుకునేవారు కూడా ఉన్నారు. ఆ తరువాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే.. వారికి పెద్దగా బాధ ఉండదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం కొత్తేమీ కాదు.
విడుదలకు ముందు అంతగా ఆశాజనకంగా అనిపించని కొన్ని కథలు.. రిలీజ్ తరువాత భారీ విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆ సినిమాను తిరస్కరించిన నటులు “అయ్యో మిస్ అయ్యానే” అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కింగ్ నాగార్జున పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది.
25
కూలీ సినిమాలో విలన్ గా నాగార్జున..
కింగ్ నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్ గా నటించిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈసినిమాలో నాగ్ స్టైలీష్ విలన్ గా అదరగొట్టాడు. ఈసినిమాలో నాగ్ పాత్రకు, ఆయన యాటిడ్యూడ్ కి చాలామంది పడిపోయారు. ఈ పాత్ర గురించి తమిళనాడు యూత్ లో పెద్ద చర్చేజరిగింది.
కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో నాగార్జున చేసిన సైమన్ పాత్రకు మంచిరెస్పాన్స్ వచ్చింది... కానీ సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
35
బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న నాగార్జున..
కూలీ సినిమా చేస్తున్న టైమ్ లోనే కింగ్ నాగార్జునకు మరో భారీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ లో కీలక పాత్ర కోసం దర్శకుడు ఆదిత్య ధర్ ముందుగా నాగార్జునను సంప్రదించాడట.
ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా చేసిన పాత్రను మొదట నాగార్జునకు ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ, ఒకేసారి రెండు సినిమాల్లో విలన్ పాత్రలు చేయడం రిస్క్ అవుతుందనే ఆలోచనతో నాగార్జున ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అలా ఆయన దురంధర్ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నాడట.
కానీ కింగ్ వదులుకున్నఈ పాత్ర ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. నాగ్ వదులుకున్నాడని అంటున్న ధురంధర్ సినిమా విడుదలై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా వదిలేసుకుని నాగార్జున చేసిన కూలీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్‌గా మిగిలింది. ఈ విషయం తెలిసి.. నాగార్జున అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
దురంధర్ సినిమాలో నాగార్జున నటించి ఉంటే ఆయన క్రేజ్ మరింత పెరిగేదని ఆ పాత్రకు నాగ్ అయితే ఇంకా బాగుండేవాడు అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరు అఫీషియల్ గా మాత్రం వెల్లడించలేదు. ఇందులో నిజం ఎంతో కూడా తెలియదు. టాలీవుడ్ లో మాత్రం ఈ విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
55
66 ఏళ్ల కుర్ర హీరో.. టాలీవుడ్ మన్మధుడు..
టాలీవుడ్ లో దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ.. స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలు కుళ్లుకునేలా ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు వ్యాపారంలో కూడా రాణిస్తున్న నాగార్జున.. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతుడిగా గుర్తించబడుతున్నారు. తెలుగు పరిశ్రమలో రొమాంటిక్ ఇమేజ్ ను సాధించిన మొదటి హీరో నాగార్జున.
టాలీవుడ్ మన్మధుడిగా పేరుతెచ్చుకున్న నాగ్ తో సినిమా కోసం హీరోయిన్లు పోటీపడేవారు అప్పట్లో. ఇక సీనియర్ హీరోలు ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. కానీ నలుగురిలో నాగార్జున మాత్రం సినిమాల విషయంలో కాస్త వెనకబడి ఉన్నాడు. పెద్దగా సక్సెస్ లు సాధించలేకపోతున్నాడు. బుల్లితెరపై హోస్ట్ గా మాత్రం ఆయన దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ షోతో స్టార్ డమ్ తో పాటు, భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నాడు.