రహస్యంగా దర్శకుడు క్రిష్‌ రెండో పెళ్లి.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే? మొదటి భార్య ఎలా విడిపోయిందంటే?

First Published | Nov 11, 2024, 7:08 PM IST

దర్శకుడు క్రిష్‌ రెండో పెళ్లి చేసుకున్నారు. రహస్యంగా ఆయన ప్రీతి చల్లా అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకోవడం విశేషం. తాజాగా ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన రహస్యంగా ప్రీతి చల్లా అనే అమ్మాయిని ఆదివారం మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం. ప్రీతి చల్లా డాక్టర్‌ కావడం విశేషం. హైదరాబాద్‌లో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా పంచుకున్నారు. దర్శకుడు క్రిష్‌, డాక్టర్‌ ప్రీతి చల్లా తన సోషల్‌ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త లైఫ్‌ స్టార్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, తమ జీవితంలో ఇది కొత్త జర్నీ అని వెల్లడించారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

దర్శకుడు క్రిష్‌ ఇప్పటికే రమ్య అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరి పెళ్లి జరగ్గా రెండేళ్లలోనే విడిపోయారు. అయితే ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థాల వల్లే విడిపోయినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్‌తో క్రిష్‌కి ఎఫైర్‌ ఉందని తెలిసి విడిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియదు.  


ఇన్నాళ్లు సింగిల్‌గానే ఉన్న క్రిష్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇటీవల వచ్చాయి. ఇప్పుడు సడెన్‌గా సీక్రెట్‌గా తన రెండో పెళ్లి చేసుకోవడం విశేషం. ఆదివారం వీరి మ్యారేజ్‌ జరిగిందట. ఈ నెల 16న సినీ ప్రముఖులు, బంధువుల కోసం రిసెప్షన్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది.  
 

క్రిష్‌ మొదటి భార్య రమ్య కూడా డాక్టరే, ఇప్పుడు క్రిష్‌ చేసుకున్నది కూడా డాక్టరే. ఇలా తన లైఫ్‌లోకి ఇద్దరూ డాక్టర్లు రావడం విశేషం. ఇక తాజాగా క్రిష్‌, ప్రీతిలకు సినిమా సెలబ్రిటీలు, ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌కి చెందిన ప్రీతి చల్లాకి ఇప్పటికే పెళ్లి అయ్యింది. అనుకోని కారణాలతో తన మొది భర్తకి విడాకులు ఇచ్చిందట. ఆమెకి  11ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని సమాచారం. 
 

దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. `గమ్యం` వంటి సూపర్‌ హిట్‌ మూవీతో తానేంటో నిరూపించుకున్న ఆయన `కంచె`, `వేదం`, `కృష్ణం వందే జగద్గురుమ్‌`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌ వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. `ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే పవన్‌తో ఏర్పడిన క్రియేటివ్‌ డిఫరెంట్స్ వల్ల ఈ మూవీ నుంచి క్రిష్‌ తప్పుకున్నారట. ప్రస్తుతం నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు, దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్‌ కేవలం దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారట. పేరుకు మాత్రమే పర్యవేక్షణ అని, ఆయన ఈ మూవీ నుంచి పూర్తిగా తప్పుకున్నారని టాక్‌. 
 

ఇదిలా ఉంటే కంటెంట్‌, సెన్సిబులిటీస్‌, సామాజిక స్పృహ ఉన్న సినిమాలు తీసి మెప్పించిన క్రిష్‌ దర్శకుడిగా రెండు ప్రాజెక్ట్ ల నుంచి మధ్యలోనే తప్పుకోవడం గమనార్హం. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ నటించిన `మణికర్ణిక` సినిమాకి మొదట ఆయనే దర్శకుడు. కానీ తెలుగులో బాలయ్య `ఎన్టీఆర్‌` బయోపిక్‌ తీస్తున్న నేపథ్యంలో ఆ మూవీ నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు పవన్‌తో చేయాల్సిన `హరిహర వీరమల్లు` నుంచి కూడా తప్పుకోవడం గమనార్హం. పెళ్లైతే కలిసొస్తుందని ఇటీవల కిరణ్‌ అబ్బవరం తెలిపారు. మరి క్రిష్‌ కి కూడా కలిసి వస్తుందా? మళ్లీ ఆయన పూర్వ వైభవం పొందుతాడా అనేది చూడాలి. ప్రస్తుతం క్రిష్‌.. అనుష్క ప్రధాన పాత్రలో `ఘాటి` సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్  ఇటీవలే అనుష్క బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇందులో అనుష్క వేరే లెవల్‌లో కనిపిస్తుంది. 

read more:అఖిల్‌ కి మాత్రం పద్ధతులు నేర్పించి నాగార్జున చేసిన పని ఇదేనా? ఆయనకు లేని రూల్స్ కొడుక్కేందుకు ?

also read: ఫ్రెండ్‌ అన్ననే ప్రేమించిన తమన్నా, అతను చెప్పిన సమాధానంతో హార్ట్ బ్రేక్‌.. మిల్కీ బ్యూటీ ఫస్ట్ క్రష్‌
 

Latest Videos

click me!