భర్తలకన్నా ఎక్కువ సంపాదించే బాలీవుడ్ భార్యలు
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కపుల్స్ ఉన్నారు. పాత తరం నుంచి ఇప్పటి వరకూ హేమా మాలిని - ధర్మేంద్ర నుండి ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ వరకు అనేక స్టార్ జంటలను ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల కంటే నటులకే ఎక్కువ పారితోషికం లభిస్తుంది. కానీ బాలీవుడ్‌లో కొంతమంది నటీమణులు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
ముందుగా చూసుకుంటే.. ఐశ్వర్య రాయ్, ఆమె భర్త మరియు నటుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ బిజీగా ఉన్న స్టార్‌లు. ఈ స్టార్ జంట ఇద్దరూ ఒక సినిమాకు 10 - 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ ప్రకటనల ద్వారా అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్య రాయ్ ఎక్కువ సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆస్తి విలువలో కూడా అభిషేక్ కంటే ఐశ్వర్య రాయ్ వద్దనే ఎక్కువ ఆస్తి ఉంది. అభిషేక్ బచ్చన్ ఆస్తి విలువ రూ.280 కోట్లు. కానీ ఐశ్వర్య రాయ్ ఆస్తి విలువ రూ.862 కోట్లు.
Also Read: బాలయ్య ముందు నోరు జారిన అల్లు అర్జున్
బిపాశా బసు :
నటి బిపాశా బసు ఒక సినిమాకు రూ. కోటి, స్టేజి షోలకు రూ.2 కోట్లు, ప్రకటనలకు రూ.2.5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ ఒక సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.
సన్నీ లియోన్
నటి సన్నీ లియోన్ ఒక సినిమాకు రూ.2 నుండి 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఆమె ఆస్తి విలువ రూ.98 కోట్లు. కానీ ఆమె భర్త డేనియల్ వెబెర్ ఆస్తి విలువ రూ. 16.8 కోట్లు.
బాలీవుడ్ నటి ఫరా ఖాన్ తన భర్త షిరిష్ కుందర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. షిరిష్ ఆస్తి విలువ గురించి సమాచారం అందుబాటులో లేదు. కానీ ఫరా ఆస్తి విలువ రూ.75 కోట్లు.
బాలీవుడ్‌లో మరో స్టార్ జంట కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్. సైఫ్ కంటే కరీనా ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఆస్తి విలువ పరంగా సైఫ్ అలీ ఖాన్ ఎక్కువ ఆస్తికి అధిపతి. సైఫ్ ఆస్తి విలువ రూ.1200 కోట్లు అని చెబుతున్నారు. కరీనా ఆస్తి విలువ రూ. 485 కోట్లు.
బాలీవుడ్‌లోని పాత తరం స్టార్ జంటలలో హేమ మాలిని - ధర్మేంద్ర జంట ముఖ్యమైనది. 76 ఏళ్ల హేమ మాలిని తన భర్త ధర్మేంద్ర కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ధర్మేంద్ర ప్రస్తుతం ఎక్కువగా నటించడం లేదు. కానీ హేమ మాలిని ప్రకటనలకు రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు సంపాదిస్తున్నారు. ఇది కాకుండా ఆమె ఎంపీగా ఉండటం వల్ల దానికి కూడా ప్రత్యేక పారితోషికం లభిస్తుంది.