అది ఆమె పర్సనల్ ఛాయిస్, ప్రమోషన్స్ కి అనుష్క అవసరం లేదు.. డైరెక్టర్ క్రిష్ కామెంట్స్ వైరల్

Published : Aug 31, 2025, 07:29 PM IST

ఘాటి ప్రమోషన్లకు హాజరుకాని అనుష్కపై వచ్చిన ప్రశ్నలకు దర్శకుడు కృష్ణ సమాధానం ఇచ్చారు. ఆమె నటనే సినిమాను విజయవంతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

PREV
15

తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న ఘాటి సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో సమావేశమైంది. ఈ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి, నటులు జగపతి బాబు, విక్రమ్ ప్రభు పాల్గొన్నారు.

25

సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు క్రిష్ తెలిపారు: “కొన్ని కథలు సహజంగా, ముడిపడిన భావాలతో శక్తివంతంగా ఉంటాయి. ఘాటి కూడా అలాంటి కథే. తూర్పు ఘాట్‌ ప్రాంతపు కఠిన పర్వతాలు, శక్తివంతమైన భావోద్వేగాలు, ధైర్యవంతమైన వ్యక్తిత్వాలు, గొప్ప ఆలోచనలు ఇవన్నీ కలసి ఈ కథకు ప్రేరణ ఇచ్చాయి” అని అన్నారు.

35

లీడ్ యాక్ట్రెస్ అనుష్క శెట్టి సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంపై వచ్చిన ప్రశ్నలకు క్రిష్ స్పందిస్తూ, “ప్రమోషన్లకు హాజరుకావడం లేదా హాజరు కాకపోవడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఘాటి చిత్రానికి అనుష్క ప్రమోషన్స్ అవసరం లేదు.. ఆమె నటన ఉంటే చాలు అని క్రిష్ జాగర్లమూడి అన్నారు. ‘శీలావతి’ పాత్రలో అనుష్క తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది” అని నమ్మకంగా చెప్పారు. అనుష్క లాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా కాబట్టి ఘాటి తప్పకుండాఆ కమర్షియల్ సక్సెస్ అవుతుంది అని అన్నారు.

45

అలాగే ప‌వన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలపై క్రిష్ స్పష్టతనిచ్చారు. “ప‌వన్ కళ్యాణ్ గారు నాకు ఎంతో ఇష్టమైన వారు. ఆయనను నేను ఎంతో అభిమానిస్తాను. ఏఎం రత్నం గారి నిర్మాణంలో వచ్చిన సినిమాలు చూస్తూ నేను పెరిగాను. వారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కోవిడ్-19 పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్లనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది” అని వెల్లడించారు.

55

ప్రస్తుతం ఘాటి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుష్క శెట్టి శక్తివంతమైన పాత్ర, తూర్పు ఘాట్‌ నేపథ్యం, జగపతి బాబు, విక్రమ్ ప్రభు కీలక పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని టీమ్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories