మోహన్ లాల్ `హృదయపూర్వం` మూడు రోజుల బాక్సాఫీసు కలెక్షన్లు.. మమ్ముట్టికి షాకిస్తూ హ్యాట్రిక్ హిట్

Published : Aug 31, 2025, 07:27 PM ISTUpdated : Aug 31, 2025, 07:32 PM IST

మోహన్‌ లాల్ మలయాళ బాక్సాఫీసుని రూల్‌ చేస్తున్నారు. ఇప్పుడు `హృదయపూర్వం`తో మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. 

PREV
15
`హృదయపూర్వం` మూవీ కలెక్షన్లు

మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌లాల్‌ వరుసగా విజయాలు అందుకుంటున్నారు. కంటిన్యూగా ఆయన హిట్‌ కొడుతున్నారు. `లూసీఫర్‌ 2`తో మలయాళంలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఆ తర్వాత `తుడరుమ్‌`తో మలయాళ ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. ఈ మూవీ గత పాత అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పుడు మరో హిట్‌ అందుకున్నారు మోహన్‌లాల్‌. తాజాగా ఆయన `హృదయపూర్వం` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

25
`హృదయపూర్వం` మూవీ కేరళా కలెక్షన్లు

శుక్రవారం విడుదలైన `హృదయపూర్వం` సినిమా బాక్సాఫీసు వద్ద హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. Sacnilk లెక్కల ప్రకారం ఈ మూవీ కేరళాలో మొదటి రోజు రూ.3.25కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.2.21కోట్లు రాబట్టింది. అయితే మూడో రోజు కాస్త కలెక్షన్లు పెరిగాయి. దాదాపు రూ.2.5కోట్లు రాబట్టినట్టు సమాచారం. దీంతో మూడు రోజుల్లో ఈ మూవీ రూ.8.6 కోట్లు రాబట్టినట్టు సమాచారం.

35
ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్‌ 3 మోహన్‌ లాల్‌ మూవీస్‌

మలయాళ మీడియా ప్రకారం ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.5కోట్లు రాబట్టింది. దీంతో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లని రాబట్టిన మూడో మూవీగా నిలిచింది. మమ్ముట్టి నటించిన `బజుక` మూవీ ఓపెనింగ్స్ ని ఇది దాటేసింది. ఆ మూవీ ఏడు కోట్లని రాబట్టడం విశేషం. ఇక మూడు రోజుల్లో ఈ మూవీ ఏకంగా రూ.25కోట్లు వసూలు చేసిందట. అయితే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ మూడు సినిమాలు మోహన్‌ లాల్‌వే కావడం విశేషం. ఆయన హీరోగా వచ్చిన `ఎల్‌2ః ఎంపురాన్‌` మొదటి రోజు ఏకంగా రూ.68.2కోట్లు వసూలు చేసింది. మలయాళంలోనే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.

45
మోహన్‌ లాల్‌ టాప్‌ 3 మూవీస్‌

ఆ తర్వాత మోహన్‌ లాల్‌ నటించిన `తుడరుమ్‌` నిలిచింది. ఈ మూవీ మొదటి రోజు రూ.17.18కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు `హృదయపూర్వం` సినిమా నిలిచింది. అయితే ఈ మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కావడం విశేషం. ఇండియన్‌ సినిమాలోనే ఇది అరుదైన రికార్డ్ గా చెప్పొచ్చు. ఒకే ఏడాది ఒకే హీరోకి చెందిన మూడు సినిమాలు విజయం కావడం, మూడు బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టడం విశేషం. దీంతో మోహన్‌లాల్‌ మలయాళంలో కింగ్‌ మేకర్‌గా, బాక్సాఫీస్‌ కింగ్‌గా నిలిచారు. ఇక పాజిటివ్‌ టాక్‌తో డీసెంట్‌ కలెక్షన్లతో రన్‌ అవుతున్న `హృదయపూర్వం` మున్ముందు ఎంతటి వసూళ్లని రాబడుతుందో చూడాలి.

55
`హృదయపూర్వం` మూవీ టీమ్‌

మోహన్‌లాల్‌ హీరోగా రూపొందిన `హృదయపూర్వం`చిత్రంలో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు సంగీత్‌ ప్రతాప్‌, సిద్ధిఖి, సంగీతా మాధవన్‌ నాయర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. సత్యన్‌ అంతికడ్‌ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆగస్ట్ 28న విడుదలైంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories