నందమూరి నట సింహం బాలకృష్ణతో సినిమా డైరెక్టర్లకు పండగే. బాలయ్య తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవారు చాలామంది ఉన్నారు. బాలకృష్ణ సినిమా వల్ల స్టార్లు గా మారిన వారు కూడా ఉన్నారు. కాని బాలయ్యతో సినిమా చేసి ఇబ్బందుల్లో పడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన శైలీ చాలా ప్రత్యేకం. ఎవరు ఎన్ని అన్నా.. తన దారి తనదే అంటుంటారు. ఆయనకు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ తెలుగు హీరోలలో ఎవరికీ లేదనే చెప్పాలి. లక్షలమంతి అభిమానులను సంపాధించుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ.
25
Nandamuri Balakrishna
65 ఏళ్ళ వయస్సులో కూడా బాలయ్య బాబులో జోరు తగ్గలేదు. హుషారు తగ్గలేదు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ హాట్రీక్ విన్నింగ్ సాధించి.. డబుల్ హ్యాట్రిక్ దిశగా పరుగులు తీస్తున్నాడు బాలయ్య బాబు. ఆయన సినిమాల వల్ల స్టార్లుగా మారిన హీరోయిన్లు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. లాభాలు జేబులో వేసుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే బాలయ్య సినిమా వల్ల ఇబ్బందులు పడ్డ దర్శకుడు కూడా ఉన్నాడట.
35
Director Krish ,Dr. Priti Challa, anushka
ఆయన మరెవరో కాదు క్రిష్ జాగర్లమూడి. క్రిష్ సినిమాలు ఒకప్పుడు వరుస విజయాలు సాధించాయి. సక్సెస్ అవ్వకపోయినా.. అద్భుతమైన సినిమాలుగా ముద్రపడ్డవి చాలా ఉన్నాయి. కాని బాలయ్యతో చేసిన రెండు సినిమాలు మాత్రం క్రిష్ కెరీర్ ను ఇబ్బందుల్లో నెట్టాయని టాక్ ఉంది. ఎందుకుంటే బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్ ను డైరెక్ట్ చేశాడు క్రిష్. కాని అవి భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి.
సినిమాలు ప్లాప్ అయినంత మాత్రన ఆ దర్శకుడి కెరీర్ ఆగిపోదు. కాని ఎందుకో తెలియదు బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు రెండు చేసిన తరువాత క్రిష్ కెరీర్ స్లో అయినట్టు అనిపించింది. ఇక హరిహరవీరమల్లు సినిమా పరిస్థితి అందరికి తెలిసిందే. ఆ సినిమా చాలా వరకూ కంప్లీట్ చేసి ఆయన చివరిలో పక్కకు తప్పుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి కెరీర్ లో ఆయనకు గ్రోత్ లేదన్న టాక్ టాలీవుడ్ లో ఉంది.
55
Balayyas Daaku Maharaaj monday collection report out
అలా బాలయ్య బాబు సినిమాలు చేసిన తరువాతే క్రిష్ కు ఈ పరిస్థితి వచ్చిందంటే యాంటీ ఫ్యాన్స్ కూడా గుగుసలాడుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్యాబాబు మాత్రం జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన మెగా డైరెక్టర్ బాబీతో డాకూమహరాజ్ సినిమాలో నటిస్తున్నారు.
ఈసినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు బాలయ్య బాబు. ఈమూవీతో పాటు ఆతరువా సినిమా కూడా హిట్ అయితే బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టే అని చెప్పాలి. ఇక హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా బాలయ్య మూడు సార్లు గెలిచారు. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ రెండింటిని బ్యాలన్స్ చేస్తున్నాడు బాలయ్య.