`జగదేక వీరుడు అతిలోక సుందరి` ఓపెనింగ్ కలెక్షన్లు.. చిరుకి సమంత షాక్
చిరంజీవి, శ్రీదేవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే సమంత రూపంలో చిరంజీవికి పెద్ద షాక్ తగిలింది.
చిరంజీవి, శ్రీదేవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే సమంత రూపంలో చిరంజీవికి పెద్ద షాక్ తగిలింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్ లో `జగదేక వీరుడు అతిలోక సుందరి` ఒకటి. ఇంకా చెప్పాలంటే ఇది ముందు వరుసలో నిలుస్తుంది. చిరంజీవి ఇమేజ్‌ని మార్చేసిన మూవీ. తెలుగు రాష్ట్రాల్లో సునామీ సృష్టించిన చిత్రం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు. వైజయంతి మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించారు. 1990 మే 9న ఈ చిత్రం విడుదలైంది.
ఆ సమయంలో రాష్ట్రంలో తుఫాన్ నెలకొంది. జనం ఇబ్బంది పడుతున్నారు. కానీ థియేటర్లలోనూ ఆడియెన్స్ తో అలాంటి వాతావరణమే నెలకొంది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆడియెన్స్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని చేశారు. ఈ మూవీ విడుదలై 35ఏళ్లు అయిన సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేశారు.
మే 9న ఈ మూవీని 4కేలో, 8కేలోకి మార్చి హెచ్‌డీ క్వాలిటీతో విడుదల చేశారు. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి విశేష స్పందన దక్కింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్లు బయటకు వచ్చాయి. ఫస్ట్ డే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో టీమ్ వెల్లడించింది.
1.75కోట్ల గ్రాస్ రావడం విశేషం. ఇది డీసెంట్ కలెక్షన్లు అనే చెప్పాలి. పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల రీ రిలీజ్‌లతో పోల్చితే తక్కువే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వసూళ్లని రాబట్టిందని చెప్పొచ్చు.
అయితే సమంత నిర్మాతగా మారి నిర్మించిన `శుభం` మూవీ కలెక్షన్లు కూడా ఆల్మోస్ట్ చిరంజీవి `జగదేక వీరుడు అతిలోక సుందరి`కి దగ్గరగా ఉండటం విశేషం. ఈ మూవీ 1.5కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. చాలా చిన్న మూవీగా విడుదలై ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషమనే చెప్పాలి. అయితే ఇది ఓ రకంగా చిరంజీవికి సమంత రూపంలో షాక్ తగిలిందనే చెప్పొచ్చు.
ఇక సమంత నిర్మించిన `శుభం` మూవీకి ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వం వహించారు. ఇందులో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్,చణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి, వంశీ ధర్‌గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. సీరియల్ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ ఎంటరటైనర్ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మున్ముందు దీని కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది.