'దేవర' తర్వాత కొరటాల శివ నెక్ట్స్ భారీగా ఊహించని హీరోతో,ఎవరంటే

First Published | Sep 2, 2024, 8:34 AM IST

దేవర పూర్తయిన తర్వాత ఏ హీరోతో చేస్తున్నాడా? అనే ఆసక్తి  ఫిలిం సర్కిల్స్ లో నెలకొంది. రీసెంట్ గా ఓ హీరోని 

 
రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ డైరక్టర్ గా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయారు. రాజమౌళి తర్వాత ఓటమని ఎరగని దర్శకుడుగా  కొరటాల శివ పేరు తెచ్చుకున్నారు. ఆచార్య తో కొంచెం వెనకబడినట్లు అనపించినా దేవర తో తానేంటో, తన శక్తి ఏమిటో చూపించబోతున్నారని అర్దమైంది. ఆయన ప్రత్యేకత కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.... తన ప్రతి సినిమాలో సామాజిక సందేశం ఉండేటట్లు చూసుకుంటూ  బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు.

ఓటమి ఎరుగని టాలీవుడ్ దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఆయన ఇప్పటి వరకూ తీసిన సినిమాలు ప్లాప్ అవ్వలేదు. అందుకే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ స్థానం ప్రత్యేకం. ఆయన టేకింగ్ కాని, స్క్రీన్ ప్లే కాని డిఫరెంట్ గా  ఉటుంది. అంతే కాదు కొరటాల రాసుకునే కథలు .. వాటి ట్రీట్మెంట్ కొత్తగా ఉంటాయి.అక్కడే ఆయన మార్క్ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది.  హీరోయిజాన్ని కొత్తగా చూపించే కొరటాల పవర్ఫుల్ డైలాగ్స్ ను కూడా హీరోతో చాలా సింపుల్ గా  చెప్పిస్తుంటాడు. అన్ని రకాల ఆడియన్స్ ను  మెప్పిచడంకోసం ఏక్కడ ఏం చేయాలో తెలిసిన దర్శకుడు కోరటాల. 


మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో కసిమీదున్న కొరటాల మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో దేవర చిత్రం చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో దేవర పూర్తయిన తర్వాత ఏ హీరోతో చేస్తున్నాడా? అనే ఆసక్తి  ఫిలిం సర్కిల్స్ లో నెలకొంది. రీసెంట్ గా ఓ హీరోని కలిసి కొరటాల ఓ భారీ ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎవరా హీరో..


వాస్తవానికి మిర్చి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ కుదరడంలేదు. అలాగే ఓ సారి  అల్లు అర్జున్ మాట్లాడుతూ కొరటాల శివ దర్శకత్వంలో తనకు సినిమా చేయాలని ఉందంటూ బహిరంగంగా చెప్పారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరితో కొరటాల సినిమా చేయబోతున్నాడా? అనే చర్చ నడుస్తోంది. కానీ ఈ హీరోలు ఎవరూ కాదని సమాచారం. 


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ని రీసెంట్ గా కొరటాల శివ కలిసి ఓ ప్యాన్ ఇండియా మూవి గురించి డిస్కస్ చేసినట్లు సమాచారం. ప్రణవ్ కూడా పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. జనతాగ్యారేజ్ సమయంలో మోహన్ లాల్ తో ఏర్పడిన పరిచయం , అప్పుడే ప్రణవ్ తో కూడా కొరటాలకు మంచి రాపో ఏర్పడిందని సమాచారం. ఈ క్రమంలో ఈ కాంబినేషన్ కు తెర తీస్తున్నారు.
 


'హృదయం' మూవీతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్- వినీత్ శ్రీనివాసన్ కాంబో మరోసారి 'వర్షంగల్కు శేషం' అనే పీరియాడిక్ డ్రామా సినిమా కోసం కలిసి పనిచేశారు.  ఈ మధ్యనే తెలుగులో ఓటిటిలో  రిలీజైన దీన్ని 80‍ల్లో సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. తెలుగులోనూ మెల్లిగా అతనికి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పుడుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగి కొరటాల శివతో సినిమా కనుక చేస్తే ..ఇక్కడ మనకు తెలుగులో దుల్కర్ తరహా మరో హీరో దొరికినట్లే అంటున్నారు.

ఇక దేవర విషయానికి వస్తే... కొరటాల శివ దర్శకత్వంతో ఎన్టీఆర్‌ (NTR) హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’ (Devara).‘ఆర్ఆర్ఆర్‌’ తర్వాత తారక్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఆయన దీని గురించి మాట్లాడుతూ.. అభిమానులంతా కాలర్‌ ఎగరేసుకునేలాంటి సినిమా అని చెప్పడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. 

Latest Videos

click me!