బిగ్ బాస్ 8 విన్నర్ రెమ్యూనరేషన్ జీరోతో మొదలు, ఎండ్ ఎక్కడంటే? రూ. 50 లక్షలు కాదు!  

First Published | Sep 2, 2024, 8:05 AM IST

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసింది. కంటెస్టెంట్స్ గా 14 మంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా చివర్లో హోస్ట్ నాగార్జున జీరో రెమ్యూనరేషన్ అంటూ షాక్ ఇచ్చారు. ఈసారి విన్నర్ కి ఇచ్చేది ఎంత?

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసింది. హౌస్లోకి  కేవలం14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ నటి యాష్మి గౌడ, నటుడు అభయ్ నవీన్, సీరియల్ నటుడు నిఖిల్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, సోషల్ మీడియా స్టార్ బేబక్క హౌస్లోకి వచ్చారు. 

వీరితో పాటు కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యాష్మి గౌడ, ప్రేరణ, సీరియల్ హీరో నిఖిల్,ప్రేరణ, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. 
 

కంటెస్టెంట్స్ అందరినీ పరిచయం చేసిన హోస్ట్ నాగార్జున మూడు కొత్త రూల్స్ చెప్పాడు. అవి గత సీజన్స్ లో లేనివి. సాధారణంగా ప్రతివారం పెర్ఫార్మన్స్ ఆధారంగా హౌస్ కి ఒకరు కెప్టెన్ అవుతారు. ఈసారి కెప్టెన్ అనే కాన్సెప్ట్ లేదు అన్నారు. మరి హౌస్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు అనేది చూడాలి. అలాగే అన్ లిమిటెడ్ రేషన్ అన్నారు. గెలుచుకుంటే ఎంత రేషన్ అయినా ఇస్తారట. 

విన్నర్ కి జీరో రెమ్యూనరేషన్ అనేది అతి పెద్ద ట్విస్ట్. నాగార్జున చెప్పిన మూడు రూల్స్ లో ఇది ఒకటి. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చివర్లో నాగార్జున కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి.. విన్నర్ గెలుచుకోబోయే రెమ్యూనరేషన్ చూడండి అన్నాడు. కర్టైన్ లాగి చూస్తే సున్నా కనిపించింది. అందరూ షాక్ అయ్యారు. 

Latest Videos


బిగ్ బాస్ విన్నర్స్ కి సాధారణంగా రూ. 50 లక్షలు ప్రైమ్ మనీగా ఇస్తారు. ఫినాలేలో హోస్ట్ నాగార్జున కొందరు కంటెస్టెంట్స్ కి కొంత మనీ ఆఫర్ చేసి రేసు నుండి తప్పుకోవచ్చని సలహా ఇస్తాడు. సీజన్ 7లో ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి నిష్క్రమించాడు. మిగిలిన రూ. 35 లక్షలు విన్నర్ పల్లవి ప్రశాంత్ కి ఇచ్చారు. 

ఈసారి విన్నర్ కి జీరో రెమ్యూనరేషన్ అంటున్నాడు నాగార్జున. అంటే విన్నర్ కి రూపాయి కూడా ప్రైమ్ మనీ రూపంలో దక్కదా... అంటే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ప్రైజ్ మనీ కూడా లిమిట్ లెస్. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా అది పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. 15వ వారానికి ప్రైజ్ మనీ ఎన్ని లక్షలకు చేరుకుంటుందో అది విన్నర్ కి దక్కుతుంది. 


ఆ ప్రైజ్ మనీ రూ. 50 లక్షల కంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కొన్ని రియాలిటీ షోలలో ఈ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. కంటెస్టెంట్స్ గెలుచుకున్న, ఓడిపోయిన డబ్బును ఎప్పటికప్పుడు డిస్ప్లే  చేస్తారు. కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యే సూచనలు కలవు. 

Bigg boss telugu 8

అయితే కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆశించిన స్థాయిలో సెలెబ్స్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వలేదనిపిస్తుంది. పేరున్న నటులు బిగ్ బాస్ షోకి రావడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టం అవుతుంది. బిగ్ బాస్ షో వలన పాజిటివ్ ఇమేజ్ కంటే, నెగిటివ్ ఇమేజ్ ఎక్కువగా వస్తుందని భవిస్తూ ఉండవచ్చు. ప్రేక్షకులు షో పట్ల ఆసక్తిగా ఉన్నారు. మేకర్స్ ఏ స్థాయిలో ఉపయోగించుకుంటారో చూడాలి.. 

click me!