రాఘవేంద్రరావు-శ్రీదేవి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దేవత ఒకటి. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. వారు అక్కాచెల్లెళ్ల పాత్రలు చేశారు. అక్క కోసం జీవితాన్ని త్యాగం చేసేదిగా శ్రీదేవి పాత్ర ఉంటుంది. లవ్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించారు.