Gunasekhar: ప్లాప్ ఇస్తే ఫోన్ కూడా ఎత్తరు.. వరుడు తర్వాత బన్నీ.. గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్

Published : Jan 26, 2026, 04:10 PM IST

గుణశేఖర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం యుఫోరియా. ఈ సినిమాలో సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు త్వరలో ఈ మూవీ విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. 

PREV
13
Allu Arjun

సినిమా ఇండస్ట్రీలో ఒక సామేత ఉంది.. ‘ ఇక్కడ విజయమే మాట్లాడుతుంది’. ఒక దర్శకుడు హిట్ ఇస్తే చుట్టూ తిరిగే హీరోలు,ప్లాప్ వస్తే కనీసం పలకరించానికి కూడా ఇష్టపడరని గుణ శేఖర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

23
వరుడు సినిమా...

అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వరుడు’ 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఈ మూవీ విడుదల చేయడానికి ముందు సినిమాకు చాలా హైప్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరోయిన్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా ఇంటర్వెల్ ముందు వరకు హీరోయిన్ ఫేస్ కూడా రివీల్ చేయలేదు. అంత హైప్ ఇచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ విషయంపై గుణశేఖర్ మాట్లాడారు.

33
బన్నీపై షాకింగ్ కామెంట్స్..

‘ మూవీలో హీరో.. హీరోయిన్ ని పెళ్లి పీటల మీద మాత్రమే చూస్తాను అని అంటాడు. అందుకే ప్రేక్షకులకు కూడా థియేటర్ కి వచ్చే వరకు హీరోయిన్ ని చూపించకుండా ఉంచుందామని సస్పెన్స్ క్రియేట్ చేశాం.నిజానికి ఈ ఐడియా కారణంగా సినిమాకు చాలా హైప్ వచ్చింది. హీరోయిన్ కూడా అందంగా ఉంది.. కానీ ప్రేక్షకుల అంచనాలకు ఆమె సరిపోలేదు’ అని గుణశేఖర్ అన్నారు.

‘ ఒక్క సినిమా ప్లాప్ ఇస్తే..కనీసం డైరెక్టర్ ఫోన్ చేసినా హీరోలు ఫోన్లు కూడా ఎత్తరు.కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు. వరుడు మూవీతో బన్నీకి నేను అట్టర్ ప్లాప్ ఇచ్చాను. అయినా కూడా రుద్రమదేవి మూవీలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం అడగగానే, అల్లు అర్జున్ వెంటనే నేను చేస్తున్నాను అని చెప్పాడు. అందుకే ఐకాన్ స్టార్ అయ్యాడు’ అని గుణశేఖర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బన్నీ గురించి గుణ శేఖర్ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.

ఇక.. రుద్రమదేవి మూవీలో గోన గన్నారెడ్డి పాత్రకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆ మూవీలో ఆయన పాత్ర ఉండేది తక్కువ సేపు అయినా అభిమానులకు మాత్రం మంచి కిక్ వచ్చింది. బన్నీ కెరీర్ లో ఇదొక బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories