నా ప్రాణాలు పోతాయి, చిరు మూవీ షూటింగ్ లో సోనాలి బింద్రే గొడవ.. డైరెక్టర్ ఎలా వార్నింగ్ ఇచ్చారో తెలుసా

First Published Jun 21, 2024, 8:12 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో చిరంజీవి ఇంద్ర చిత్రం చేసి వసూళ్ల ప్రభంజనం సృష్టించారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో చిరంజీవి ఇంద్ర చిత్రం చేసి వసూళ్ల ప్రభంజనం సృష్టించారు. ఈ చిత్రంలోని ఫ్యాక్షన్ కథ, బి గోపాల్ దర్శకత్వం, చిరంజీవి నటన, డ్యాన్సులు.. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ గ్లామర్ హైలైట్ గా నిలిచాయి. 

ఈ చిత్ర షూటింగ్ అంత సులభంగా జరగలేదని డైరెక్టర్ బి గోపాల్ ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఇంద్ర చిత్రంలో కాశీలో ఫస్ట్ డే షూటింగ్.. సోనాలి బింద్రే వచ్చింది. ఫస్ట్ సీన్ గంగలో స్నానం చేసే సన్నివేశం చేయాలి. గంగలో మూడుసార్లు మునిగి లేవాలి అని సీన్ చెప్పా. 

సోనాలి బింద్రే షాక్ అయింది. గంగలో మునగాలా.. డైరెక్టర్ గారు ఈ సీన్ నేను చేయను. గంగలో మునిగితే నేను అలాగే కనిపించకుండా పోతానేమో.. నా ప్రాణాలు పోతాయి అని గొడవ పెట్టుకుంది. లేదమ్మా నువ్వు చేయకుంటే ఈ సీన్ మొత్తం తీసేయాలి. ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం అని చెప్పా. అయినా వినలేదు.. నాకు చచ్చేంత భయం.. నేను చేయను అని చెప్పింది. 

నువ్వైతే ఈ సీన్ చేయాల్సిందే. లేదంటే షూటింగ్ ఆపేస్తా అని వార్నింగ్ ఇచ్చినట్లు బి గోపాల్ తెలిపారు. భయం అంటున్నావు కాబట్టి ఒక పని చేస్తా.. మూడు యాంగిల్స్ లో మూడు కెమెరాలు పెడతా.. నువ్వు ఒక్కసారి మునిగితే మూడుసార్లు మునిగినట్లు చూపించవచ్చు అని చెప్పినట్లు బి గోపాల్ తెలిపారు. 

అప్పుడు ఒప్పుకుని చేసింది. అయితే ఫస్ట్ టేక్ లో సరిగ్గా రాలేదు. ఆ తర్వాత మరోసారి కన్విన్స్ చేసి చిత్రీకరించినట్లు గోపాల్ తెలిపారు. ఈ చిత్రంలో సోనాలి బింద్రే నటన చాలా బావుంటుందని ప్రశంసించారు. 

ముఖ్యంగా కాశీ ఎపిసోడ్ లో చిరంజీవితో కలసి చాలా ఫన్నీగా నటించింది అని అన్నారు. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ఇద్దరూ పోటా పోటీగా నటించారు. 

Latest Videos

click me!