షాకింగ్: “కల్కి” తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లో రిలీజా?, ఎంత బిజినెస్ అయ్యింది?

First Published | Jun 21, 2024, 6:00 PM IST


ఆంధ్రా,తెలంగాణాలలో థియేటర్స్ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ ఈ సినిమా రిలీజ్ తో గత వైభవం చూస్తాయని అంటున్నారు. 

Kalki

భారతీయ సినీ  ప్రేమికులంతా  ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న సినిమా 'కల్కి 2898 AD'. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడే కొలిదీ కల్కిపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అవుతోంది. ఇప్పటికే బయిటకు వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక నిన్న విడుదలైన భైరవ అంథమ్‌ సాంగ్‌లు అయితే యూట్యూబ్‌ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈసాంగ్‌ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌లో టాప్‌ ట్రెండింగ్‌ ఉంది. ఈ నేపధ్యంలో తెలుగులో ఎన్ని థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అసలు ఇక్కడ ఎంతకు అమ్మారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

 కల్కి ఇప్పుడు రిలీజ్‌కు ముందే భారీగా బిజినెస్‌ చేస్తూ షాక్ ఇస్తోంది.  ఓవర్సీస్‌లో కల్కి ఊపు చూస్తుంటే ఈ మూవీ ఎక్సపెక్టేషన్స్ కు  మించి వసూలు చేసేలా ఉందంటున్నారు. ఇంకా రిలీజ్‌కు వారం ఉండగానే అప్పుడే ప్రీ బుక్కింగ్స్‌లో కల్కి రికార్డు క్రియేట్‌ చేసింది. జూన్‌ 27న మూవీ రిలీజ్‌ కానుండటంతో నార్త్‌ అమెరికాలో అప్పుడే ప్రీ బుక్కింగ్స్‌ ఒపెన్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకు కల్కికి ప్రీ సేల్‌లో 2 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.

Latest Videos


ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చే సరికి  ఆంధ్రా, తెలంగాణాలో కలిపి 800 థియేటర్స్ దాకా రిలీజ్ కు ప్లాన్ చేసారు. సలార్ ని మించిన రిలీజ్ ఇది. ఈ మధ్యకాలంలో అతి పెద్ద రిలీజ్ అని చెప్తున్నారు. అయితే 800 థియేటర్స్ కే ప్లాన్ చేసినా టాక్ ని బట్టి ఆ మధ్యాహ్నానికే మరో వంద థియేటర్స్ పెరిగే అవకాసం ఉందంటున్నారు. 

ఆంధ్రా,తెలంగాణాలలో థియేటర్స్ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ ఈ సినిమా రిలీజ్ తో గత వైభవం చూస్తాయని అంటున్నారు. ఇన్నాళ్లుగా కలెక్షన్స్ ఖాళీ థియేటర్స్ ని చూస్తున్న ఎగ్జిబిటర్స్ ఈ సినిమాతో కష్టకాలం పోయినట్లే అనుకుంటున్నారని ట్రేడ్ భావిస్తోంది. 
 

ఇక తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే..రెండు రాష్ట్రాల్లో 180 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. రకరకాల ఎగ్రిమెంట్స్ తో ఈ డీల్స్ క్లోజ్ చేసారని వినికిడి. అయితే డిస్ట్రిబ్యూటర్స్  అందరూ తాము పెట్టిన పెట్టుబడికు నాలుగైదు రెట్లు వెనక్కి తెచ్చుకుంటామనే థీమాతో ఉన్నారట. తెలంగాణా రైట్స్ 70 కోట్లకు వెళ్లాయంటున్నారు. 
 

Kalki 2898 AD

ఇక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ.... నేను రేటు విషయం గురించి మాట్లాడను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కల్కితో థియేటర్స్ మాత్రం ఫుల్ బిజినెస్ లోకి  వస్తాయి. ప్రేక్షకులు ఎప్పుడూ స్టార్స్ ఉన్న సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు అంటే ఆసక్తి చూపెడతారు. కాబట్టి మేము మాగ్జిమం థియేటర్స్ ని తెలంగాణాలో కేటాయిస్తున్నాం. భారీ కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నాం.  ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్ సైతం చాలా కాన్ఫిడెంట్ గా తమ తమ ప్లాన్స్ లో ఉన్నారు అని చెప్పుకొచ్చారు. 

రిలీజ్‌కు ముందే ఈ స్దాయి బిజినెస్‌ జరిగితే.. ఇక హిట్‌ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఓవర్సిస్‌లో కాసులే వర్షం మే.   వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద రూ. 1000 కోట్ల గ్రాస్‌ ఈజీగా లాగేస్తుంది. ఏదైమైనా ప్రభాస్తో సినిమా చేస్తే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తోనే మేకర్స్‌ లాభాలు పొందుతున్నారు.
 

ఇక ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్ సపరేటు. ఏదేమైనా ప్రభాస్‌తో సినిమా అంటే నిర్మాతలకు కాసుల వర్షమే అని మరోసారి 'కల్కి' ప్రీ సేల్స్‌ చూస్తుంటే రుజువు అవుతుంది. కాగా ఈ సినిమాకు ప్రభాస్‌ భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మూవీ బడ్జెట్‌లో దాదాపు 25 శాతం ప్రభాస్‌ పారితోషికం ఉంటుందని చెప్పుకుంటున్నారు. 
 

తమిళంలో శ్రీ లక్ష్మీ మూవీస్ వారు కల్కి చిత్రం తమిళ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. వారు గతంలో పుష్పను భారీ ఎత్తున రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. దాంతో వారికే ఈ కల్కి రైట్స్ ఇచ్చారు. కల్కి చిత్రం బ్రేక్ ఈవెన్ 22 కోట్లుగా ఫిక్స్ చేసారు. అంటే గ్రాస్ 40 కోట్లు దాకా రావాలి. దాంతో ప్రభాస్ మీద కన్నా అక్కడ బిజినెస్ కమల్ ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తున్నారు. కమల్ సినిమాకు వచ్చే ఓపినింగ్స్, కలెక్షన్స్ మామూలుగా ఉండవు కాబట్టి ఖచ్చితంగా కల్కికు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. అయితే తమిళం వారు మొదట నుంచి తెలుగు సినిమాలను చిన్న చూపు చూస్తూ వస్తున్నారు. అదొక్కటే డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెడుతున్న అంశం.  

 కంటెంట్ విషయానికి వస్తే... కల్కి 2898 AD’ కథ మహాభారతం నుండి మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఏ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. అతి తక్కువ సినిమాలతోనే అతి పెద్ద స్టార్ డైరక్టర్ గా ఎదిగిన నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు  సినిమాపై ఉన్న అంచనాలు.. నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయనటంలో సందేహం లేదు.  

 ‘ఈ భూమిలో మొదటి నగరం, చివరి నగరం కాశీ. పైన నీరు ఉంటుందట. భూమి పై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుంది’ అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు.ట్రైలర్ చూసిన వారంతా వావ్ అనే ఒకే ఒక పదం వాడుతున్నారు. టిక్కెట్ బుక్కింగ్స్ ప్రారంభమైన ఓవర్ సీస్ లో టిక్కెట్ సేల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక 40 శాతం పెరిగాయని తెలుసింది. ఈ క్రమంలో ఈ సినిమాని గురించిన ప్రతీ అంశం ఆసక్తికరమే. 

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సూపర్ హీరోగా చూపించారు. అలాగే బరో వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాలో అద్భుతమైన ఫైట్స్‌ని కంపోజ్ చేశారని ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది.  ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో స్టార్ నటీనటులు కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ గెస్ట్  పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ పాత్ర మాత్రం కేవలం క్యామియో రోల్ కాదని తెలుస్తోంది.  

ట్రైలర్‌లోనే దర్శకుడు దాదాపు స్టోరీ లైన్ చెప్పేశాడు. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే ప్రాంతం కాంప్లెక్స్. అక్కడికి వెళ్లాలని ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన బౌంటీలను సంపాదించే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన డీల్స్ ను పూర్తి చేస్తుంటాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీపికాను తీసుకురావాలన్న డీల్ పై హీరో బయలుదేరుతాడు. ఆమెను కాపాడుతున్న అమితాబ్ (అశ్వథామ)తో భైరవ యుద్ధం చేస్తాడు. అలాగే ట్రైలర్ లో చిన్నపిల్లవాడు అమితాబ్ తో మాట్లాడుతూ కనిపించాడు. బహుశా అతనే కల్కి అయ్యే అవకాశం ఉంది. 

కల్కిని చెడ్డవారి చేతుల్లో పడకుండా అశ్వథామ కాపాడుతుంటాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను భైరవ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా తనకు తెలియని ఓ పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. ట్రైలర్‌ను మనం క్షుణ్ణంగా గమనిస్తే ఇదే కథ మనకు కనిపిస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్, అమితాబ్ , దీపికా పాత్రలు హైలైట్ కానున్నాయి. అలాగే కమల్ హాసన్ ను కూడా మాములు మానవుడిగా చూపించలేదు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసం భారీగా ఖర్చు చేశారు. 
 

నాగ్ అశ్విన్  మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 

click me!