ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ నుంచే గట్టిగా గొడవలు, ప్రేమలు ఏడుపులతో హౌస్ అంతా ఉత్కంఠగా సాగుతోంది. అయితే ప్రతీసారి హౌస్ లోకి 16 మంది కంటస్టెంట్స్ సందడి చేసేవారు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది. ఈ సారి మాత్రం రావడమే 14 మంది హౌస్ లోకి వచ్చారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ద అవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 Bigg Boss Season 7 Telugu లో ఉన్న కంటెస్టెంట్స్ చాలామంది ఆడియన్స్ కు పెద్దగా తెలిసినవారు కాదు. సీరియల్స్ రెగ్యూలర్ గా చూసేవారికి మాత్రం అందులో ఓ నలుగురు బాగాపరిచయం ఉండి ఉంటారు. అంత తప్పించి గత సీజన్ లో ఉన్నవారిలో కంటే.. ఈసారి ఉన్నవారు పరిచయం లేని ముఖాలు ఎక్కువగా ఉన్నాయి. ఈక్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇప్పుడు ఉనన్నవారు చాలా మందికి తెలియదు కాబట్టి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే కాస్త తెలిసిన ముఖాలను తీసుకురావాలి అనిచూస్తున్నారట. అందుకు తగ్గట్టుగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఇప్పటికే రెడీ చేసినట్టు తెలుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పలు సీరియల్స్ లో హీరోగా.. టోన్డ్ బాడీతో.. అమ్మాయిల మనసుల్లో రొమాంటిక్ ఇమేజ్ సాధించాడు అర్జున్.
అర్జున్ తో పాటు సుప్రిత కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సిప్రీత సోషల్ మీడియాలో స్టార్ గా వెలుగు వెలుగుతోంది. అంతే కాదు ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు. తల్లీ కూతరు కలిసి నెట్టింట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరు ఈ వీక్ లోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
పలువురు సీరియల్ నటీనటులు ఉన్నారు. ఇప్పుడు అర్జున్ అంబటి కూడా వారిలో ఒకటి అవ్వబోతున్నాడు. స్టార్ మాలో సైతం పలు సీరియల్స్‌లో హీరోగా నటించి మెప్పించిన అర్జున్.. కేవలం యాక్టర్‌గా మాత్రమే కాకుండా డ్యాన్సర్‌గా, యాంకర్‌గా తనలోని మల్టీ టాలెంట్స్‌ను బయటపెట్టాడు. ఇక ఈసారి సీజన్ లో సీరియల్ స్టార్స్ హవా ఎక్కువైపోయిందనే చెప్పాలి.