అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ లో పని మొదలుపెట్టిన అట్లీ, ఏం చేయబోతున్నారంటే?

Published : May 21, 2025, 07:46 PM IST

అల్లుఅర్జున్ సినిమా కోసం హైదరాబాద్ చేరుకున్నాడు అట్లీ. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కబోతున్నా సినిమా కోసం అంతా సిద్దం చేసుకున్నారు టీమ్. ఇంతకీ హైదరాబాద్ చేరుకున్న అట్లీ ఏం చేయబోతున్నాడంటే? 

PREV
16

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అట్లీ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ఈసినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమా ద్వారా అట్లీ తొలిసారి తెలుగు సినిమాకు దర్శకుడిగా పరిచయం కానుండటం విశేషం.

26

ఈ భారీ స్థాయి చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ Sun Pictures నిర్మిస్తోంది. కళానిధి మారన్ ఈ సినిమాను దాదాపు 8‌‌00 కోట్ల బారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్-ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఇటీవల లాస్ ఏంజెలెస్ స్టూడియోలో ఈ సినిమాను ప్రకటించిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియోలో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో పాటు దర్శకుడు అట్లీ కనిపించారు.

36

ప్రస్తుతం "Project A22 x A6" అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. భారతీయ భావోద్వేగాల పునాది మీద ఆధారపడిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడుతోంది. ఇందులో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందించబోతున్నారు.

46

ఈ నేపథ్యంలో, దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాదుకు చేరుకున్నారు. అల్లు అర్జున్‌తో ప్రీ-ప్రొడక్షన్ చర్చల్లో పాల్గొననున్నారు. షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

56

బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పేరుగాంచిన అట్లీ ఇప్పటికే "జవాన్", "మెర్సల్", "బిగిల్", "తేరి" వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఇక అల్లు అర్జున్ "పుష్ప" సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన సినిమా అనుభవంగా నిలవనుంది.

66

ఇక ఈసినిమాకు సబంధించిన ఇతర వివరాలు మూవీ టీమ్ వెల్లడించలేదు. టైటిల్ తో పాటు నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. టెక్నికల్ క్రూ తో పాటు విడుదల తేదీకి సంబంధించిన సమాచారం త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories