పెళ్లి కాకుండానే సీమంతం, బేబీ బంప్ తో కనిపించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : May 21, 2025, 07:11 PM IST

పెళ్లి కాకముందే బేబీ బంప్ ఫోటోలతో షాక్ ఇచ్చింది ఓ హీరోయిన్. అంతే కాదు సీమంతం కూడా చేసుకుందీ బ్యూటి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లవ్వకుండానే సీమంతం చేసుకున్న స్టార్ బ్యూటీ ఎవరు? 

PREV
14

తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ, రీసెంట్ గా ఆమె ఓ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమె గర్భవతి అయ్యిందా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ పెళ్ళి కాకుండానే ఆమె ప్రెగ్నంట్ ఎలా అయ్యింది. సీమంతం ఎలా చేసుకుంది.

24

నిజానికి స్టార్ హీరోయిన్ గర్భవతి కాదు; ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'మామన్' కోసం ఈ బేబీ బంప్ లుక్‌ లో కనిపించింది ఐశ్వర్య.'మామన్' సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఈ ఫోటోలు, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలయ్యాయి. తమిళ్ స్టార్ హీరో సూరి సరసన ఐశ్వర్య లక్ష్మీ ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు, ఈ లుక్‌ను అభిమానులకు పరిచయం చేయడం ద్వారా, సినిమా పై అంచనాలను పెంచారు మూవీ టీమ్.

34

ఐశ్వర్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందా అని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఈ లుక్‌ను సినిమా పాత్రలో భాగంగా మాత్రమే భావిస్తున్నారు. అయితే, చిత్ర బృందం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు.

44

'మామన్' సినిమా తర్వాత, ఐశ్వర్య లక్ష్మీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రస్తుతం, ఆమె సాయి ధరమ్ తేజ్ సరసన 'సంబరాల ఏటి గట్టు' సినిమాలో నటిస్తున్నారు. ముందుగా, ఆమె సత్యదేవ్‌తో కలిసి 'గాడ్సే' సినిమాలో నటించారు. ఈ ప్రాజెక్టులు ఆమె కెరీర్‌లో కీలకమైన మైలురాయిలుగా నిలుస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories