Atlee Wife Pragnancy: తమిళంలో విజయ్‌తో `తేరి`, `మెర్సల్`, `బిగిల్` వంటి హ్యాట్రిక్ హిట్ చిత్రాలు అందించిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో మూవీ చేస్తున్నారు. తాజాగా ఆయన రెండో సారి తండ్రి కాబోతున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
సౌత్‌లో సంచలనంగా మారిన దర్శకుడు అట్లీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన మరోసారి తండ్రి కాబోతున్నారు. తమ ముగ్గురు ఉన్న కుటుంబం ఇప్పుడు కాస్త పెద్దగా మారబోతుందని వెల్లడించారు. ఇప్పటికే కొడుకు మీర్‌కు తల్లిదండ్రులైన ప్రియ, అట్లీ.. తాము రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
25
రెండో బిడ్డపై అట్లీ పోస్ట్
`మా కొత్త సభ్యుడి రాకతో మా ఇల్లు మరింత మధురంగా మారబోతోంది. అవును! మేము మళ్లీ ప్రెగ్నెంట్. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ప్రార్థనలు కావాలి. ప్రేమతో అట్లీ, ప్రియ, మీర్, బెక్కీ, యూకీ, చోక్కీ, కాఫీ, గూఫీ` అని ఈ జంట పోస్ట్ చేశారు.
35
అట్లీ ఫ్యామిలీకి సెలబ్రిటీల విషెస్
ఈ జంట ఈ గుడ్ న్యూస్ చెప్పిన కొద్దిసేపటికే, సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నటి సమంత `చాలా అందంగా ఉంది. కంగ్రాట్స్ నా అందమైన మమ్మ` అని కామెంట్ చేశారు. అభిమానులు కూడా అట్లీ-ప్రియ జంటకు విషెస్ చెబుతున్నారు.
అట్లీ, ప్రియ జంట 2014లో పెళ్లి చేసుకున్నారు. వారికి 2023లో మీర్ అనే మొదటి బిడ్డ పుట్టాడు. అట్లీ 2013లో 'రాజా రాణి'తో దర్శకుడిగా పరిచయమయ్యారు. విజయ్‌తో 'తేరి', 'మెర్సల్', 'బిగిల్' వంటి వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఆయన ఫేమస్ అయ్యారు.
55
అల్లు అర్జుతో అట్లీ మూవీ
2023లో, షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇది భారత సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది వెయ్యి కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది.