2.అమలాపాల్..
రఘువరన్ బీటెక్, వీఐపీ సినిమాలో ధనుష్, అమలాపాల్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమయాణం మొదలైందంటూ వార్తలు వచ్చాయి. అమలాపాల్ విడాకులకు కూడా ఈ సినిమాలే కారణం అని రూమర్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత అమలపాల్ మరొకరిని పెళ్లి చేసుకోవడం గమనార్హం.
3.త్రిష..
చాలా కాలం క్రితం ధనుష్ , త్రిష మధ్య మంచి స్నేహం ఉండేది. కొన్ని పార్టీల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో, వీరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వచ్చాయి. కానీ, వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులమని పలుమార్లు స్పష్టం చేశారు.
4. నిత్య మీనన్ ..
'తిరుచిత్రంబలం' (తెలుగులో 'తిరు') సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, ధనుష్ , నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు నిజ జీవితంలో ఒక్కటైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.