హీరోగా అనీల్ రావిపూడి,కాకపోతే ఓ కండీషన్

First Published | Aug 12, 2024, 6:05 AM IST

కెరీర్ ప్రారంభం నుంచి కామెడీకు, మాస్ ఎలిమెంట్స్ కలిపి వరుస సక్సెస్ లు ఇస్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi).


హీరోలు కెరీర్ లో కొంత దూరం ప్రయాణించాక సక్సెస్ అందుకున్నాక తమ అనుభవంతో డైరక్టర్స్ అవటం చూసాము. అలాగే డైరక్టర్స్ అడపదడపా కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయటం చూసాం. దర్శకత్వం నుంచి రిటైర్ అయ్యాక క్యారక్టర్ ఆర్టిస్ట్ లు గా తెరపై కనిపించి సక్సెస్ అయ్యిన వాళ్ళను చూసాం. అయితే డైరక్టర్స్ ...హీరోగా అయ్యి సినిమాలు చేయటం మాత్రం తక్కువే. తమిళంలో భాగ్యరాజా , తెలుగులో దాసరి, కె విశ్వనాథ్, కన్నడంలో కాశీనాథ్  వంటివారే డైరక్షన్ చేస్తూ  తాము ప్రధాన పాత్రలుగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఈ జనరేషన్ లో దర్శకుడుగా,హీరోగా ముందుకు వెళ్తన్న వ్యక్తి తరుణ్ భాస్కర్. ఇప్పుడు అదే రూట్ లో  దర్శకుడు అనీల్ రావిపూడి ...హీరోగా లాంచ్ అయ్యేందుకు ప్రయత్నాల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 


 కెరీర్ ప్రారంభం నుంచి కామెడీకు, మాస్ ఎలిమెంట్స్ కలిపి వరుస సక్సెస్ లు ఇస్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). వరుస హిట్‌లతో  దూసుకుపోతున్న ఈ యంగ్ డైరక్టర్ అప్పుడప్పుడూ టీవీ షోలలో కనిపించి అలరిస్తూంటారు. అయితే ఆయన హీరోగా చేస్తారని ఎవరూ ఊహించరు. ఓ నిర్మాత ...ఈ డైరక్టర్ దగ్గర ఈ ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత తాను కొన్ని కండీషన్స్ తో ఓకే చేస్తానని చెప్పారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.


 
ఆ కండీషన్ ఏమిటంటే తాను చీప్ సినిమాలో చేయడు. అలాగే తనపై మినిమం ఇరవై కోట్లు పెట్టగలిగితే సినిమా చేస్తానని చెప్పారట. అలాగే ఫలానా హీరోని గెస్ట్ గా తీసుకురండి..సినిమాలో చూపించి బిజినెస్ చేద్దాం వంటివి తాను ఒప్పుకోను అని క్లియర్ గా చెప్పేసారట. నిర్మాత అన్ని కండీషన్స్ కు ఓకే చెప్పారా లేదా అనేది తెలియలేదు. ప్రస్తుతం అనీల్ రావిపూడి బరువు తగ్గిఫిట్ గా రెడీ అవుతున్నారు. అయితే అనీల్ రావిపూడి ని హీరోగా చేద్దామనుకున్న నిర్మాత ఎవరనేది తెలియలేదు. దిల్ రాజు అని కొందరంటున్నారు. 

Ram Charan


గతంలో కూడా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ హీరోగా దిల్‌ రాజు ఓ చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు. శీనయ్య పేరుతో ప్రారంభోత్సం కూడా జరుపుకున్న ఈ చిత్రం రకరకాల కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో అనీల్ రావిపూడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సరదాకి హీరో అయితే తన ఇమేజ్ పోతుందని భావిస్తున్నారు. ఏది చేసినా సీరియస్ గా వంద శాతం ఎఫెర్ట్ పెట్టి చేయగలిగితేనే చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. 


ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో  వెంకటేష్‌ హీరోగా నటిస్తున్నాడు. దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ కాబట్టి బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉంటుంది.  ఇందులో  మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా చేసారు..  మరో  పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు  దర్శకుడు అనిల్‌రావిపూడి ప్రకటించారు యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. 
 


ఇందులో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్‌ రివీల్‌ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్‌ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ అని ఆయన అన్నాడు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్‌ రావిపూడి తెలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘సంక్రాంతికి వొస్తున్నాము’ అనే పేరు పెట్టించారని తెలుస్తోంది.  ఇక ఈ చిత్రంలో ఇద్దరు స్టార్‌ హీరోలు గెస్ట్ రోల్స్ పోషించబోతున్నారట. వారిలో ఒకరు నటసింహం నందమూరి బాలయ్య కాగా, మరొకరు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే వీరిద్దరిని సినిమాలో నటించేందుకు దర్శకుడు అనిల్ ఒప్పించినట్లు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!