సెప్టెంబర్ 1న గ్రాండ్గా లాంఛ్ అయిన బిగ్‌బాస్ సీజన్ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అందులో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఎలిమినేట్ అయ్యారు.
ఈ ఆదివారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్పై అటు కంటెస్టెంట్లు, ఇటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు దిల్ సే మెహబూబ్.
గతంలో తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మెహబూబూబ్.. ఈఆసారి సీజన్ 8 లో మరోసారి హడావిడి చేయడానికి సై అంటున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో టాస్కులు ఆడి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్నాడు మెహబూబ్.