దానికి ఓకేనా అని అడిగాడు..దిగజారి తెచ్చుకునే ఆఫర్ అవసరం లేదు, నిర్మాతకే వణుకు పుట్టించిన రోహిణి

First Published | Oct 6, 2024, 9:16 PM IST

జబర్దస్త్ షోతో జంట్స్ మాత్రమే కాదు చాలా మంది లేడీ కమెడియన్లు కూడా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. వారిలో జబర్దస్త్ రోహిణి ఒకరు. రోహిణి కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా.. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో కూడా బిజీగా గడుపుతోంది.

జబర్దస్త్ షోతో జంట్స్ మాత్రమే కాదు చాలా మంది లేడీ కమెడియన్లు కూడా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. వారిలో జబర్దస్త్ రోహిణి ఒకరు. రోహిణి కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా.. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో కూడా బిజీగా గడుపుతోంది. అప్పుడప్పుడు సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది. హీరోయిన్ ఫ్రెండ్ లాంటి  క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. 

రోహిణి బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రోహిణి పాల్గొంది. 28వ రోజున ఆమె ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడు మరోసారి రోహిణికి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోహిణి వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో రోహిణి గురించి ఆసక్తికర విషయంలో వైరల్ అవుతున్నాయి. 


Jabardasth Rohini

రోహిణి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె గ్రాడ్యుయేట్. ఉద్యోగం చేస్తూ మానేసి సినిమాల కోసం వచ్చేసింది. అయితే కుటుంబ సభ్యులు బిగినింగ్ లో వద్దని చెప్పారట. ఎందుకంటే ఇండస్ట్రీ పై బయట ఉన్న అభిప్రాయాలు వేరు. వాళ్ళ బంధువులు అయితే ఈ బతుకు మనకి అవసరమా అని అడిగారట. దీనితో రోహిణి వాళ్లందరికీ నచ్చ జెప్పింది. మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నా గురించి మీకు తెలియదా అని చెప్పిందట. 

Jabardasth Rohini

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కాస్టింగ్ కౌచ్ సంఘటనలు కొన్ని ఎదురయ్యాయి అని రోహిణి పేర్కొంది. ఒక టివి సీరియల్ లో ఆఫర్ ఉందని రోహిణికి తెలిసింది. టాలీవుడ్ నటుడు బెనర్జీ తండ్రితో రోహిణికి పరిచయం ఉందట. ఆయన ఒక టివి సీరియల్ ఆఫర్ ఉందని ఆడిషన్స్ కి వెళ్ళమని చెప్పారట. దీనితో రోహిణి వెళ్ళింది. ఆ సీరియల్ లో ఆమెది కామెడీ రోల్. రోహిణి కామెడీ బాగా చేస్తుంది కాబట్టి ఆడిషన్స్ లో సెలెక్ట్ అయింది. మేనేజర్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారు.. కంగ్రాట్స్ అని చెప్పారు. అప్పుడే అతడు డబుల్ మీనింగ్ తో మాట్లాడడం మొదలు పెట్టాడు. 

మరి కమిట్ మెంట్ సంగతి ఏంటి అని అడిగాడు. కమిట్మెంట్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకే నేను బాగా కమిట్మెంట్ తో నటిస్తాను అని చెప్పా. ఆ కమిట్మెంట్ కాదు ఇది వేరే కమిట్మెంట్ అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థం అయింది అలాంటివి నాకు అవసరం లేదు. దిగజారి తెచ్చుకునే ఆఫర్ నాకు వద్దు. నేను గ్రాడ్యుయేట్ ని ఎలాగైనా బతకగలను అంటూ మేనేజర్ ముఖం మీదే చెప్పేసి వచ్చేశా. తిరిగి వచ్చి బెనర్జీ గారి తండ్రికికి ఈవిధంగా అడిగారు అని చెప్పా. 

ఆయన సీరియల్ నిర్మాతకు ఫోన్ చేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. నిర్మాత రోహిణికి ఫోన్ చేసి అడిగారట. ఏవమ్మా నేను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అడిగారట. మీరు కాదు సర్ మీ మేనేజర్ అడిగారు.. మేనేజర్ అడిగితే నువ్వు నాకు కంప్లైంట్ చేసి ఉంటే సరిపోయేది.. ఆయనకి ఎందుకు చెప్పావు.. ఆయన నన్ను తిడుతున్నారు అంటూ బాధపడ్డారట. అక్కడితో తాను ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్లు రోహిణి పేర్కొంది. మరొక ఆఫీస్ లో నా ఫ్రెండ్ కి తెలిసిన మేనేజర్ ఉన్నాడు. అతడి దగ్గరికి వెళితే.. నీకు ఏ సీరియల్ లో కావాలంటే ఆ సీరియల్ లో ఛాన్స్ ఇప్పిస్తా.. నాకు ఏంటి అని అడిగాడు.. నేను ఒక్క మాట చెప్పా.. నీకు ఏమి లేదు.. నీకు ఏదో ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.. నేను కష్టపడి ఆడిషన్స్ చేసి ఛాన్స్ తెచ్చుకోగలను అని తిట్టేసి వచ్చేసిందట. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డు ద్వారా వెళుతున్న రోహిణి ఎలా రాణిస్తుందో చూడాలి. 

Latest Videos

click me!