బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ని ఇంటికి పంపించారు. ఇక వీకెండ్‌లో మరో కంటెస్టెంట్ ని ఇంటికి పంపించారు. నైనిక ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్‌లో ఉన్న వారిలో మణికంఠ, నైనికా ఉండగా, చివరగా నైనిక ఎలిమినేట్ అయినట్టు తేల్చాడు నాగార్జున. దీంతో అంతా షాక్ అయ్యారు. మణికంఠ ఎలిమినేట్ అవుతాడని ఇంటి సభ్యులు భావించారు. కానీ నైనిక ఎలిమినేట్ కావడంతో సీత కన్నీళ్లు పెట్టుకుంది.
అనంతరం స్టేజ్‌మీదకు వెళ్లింది నైనిక తన జర్నీని చూసుకుని ఆశ్చర్యపోయింది. నిజంగా తాను అలా అరుస్తానని ఊహించలేదని, అందులో ఉన్నది నేనేనా అని ఆశ్చర్యం వ్యక్తంచేసింది నైనిక. తన జర్నీ చాలా హ్యాపీగా ఉందని, చాలా సాటిస్పైయింగ్‌గా ఉందని తెలిపింది. అనంతరం హౌజ్‌మేట్స్ గురించి కూడా చెప్పింది. ఎవరు ఏంటి అనే విషయాలను వెల్లడించారు. ఎవరు ఎలాంటి వారు, ఎలా ప్రవర్తిస్తారనేది తెలిపింది నైనిక.
ఈ క్రమంలో మానుప్యూలేటర్‌గా ప్రేరణ అని తెలిపింది. ఆటపై ఆమెకి క్లారిటీ ఉంటుందని, కానీ ఇతరులను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఇక నాగమణికంఠకి షాకింగ్ ట్యాగ్ ఇచ్చింది. ఆయన వెన్నుపోటు దారుడు అని తేల్చింది. తాను ఆల్ రెడీ హౌజ్‌లో దాన్ని అనుభవించానని, తనకు చాలా సార్లు వెన్నుపోటు పొడిచినట్టు తెలిపింది. అటెన్షన్ సీకర్‌గా పృథ్వీరాజ్‌కి ట్యాగ్ ఇచ్చింది. ఫేక్ ఫ్రెండ్ విష్ణు ప్రియా అని తెలిపింది.
అవకాశవాది ట్యాగ్‌ని నబీల్‌కి ఇచ్చింది. నిజమైన ప్రేమ కిర్రాక్ సీత పంచుతుందని, తను బెస్ట్ ఫ్రెండ్ అయ్యిందని చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. చాలా మిస్ అవుతున్నట్టు తెలిపింది నైనిక. అనంతరం గేమ్ ఛేంజర్ ట్యాగ్‌ని నిఖిల్‌కి ఇచ్చింది. తన ఆట తీరు, ప్రవర్తనని బట్టి తనే బిగ్ బాస్ విన్నర్‌గా తేల్చేసింది. నిఖిల్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా యష్మిపై షాకింగ్ కామెంట్ చేసింది. ఆమె గాలి మొత్తం తీసేసింది. హౌజ్‌లో యష్మి ఫైర్ బ్రాండ్‌లా మారిపోయిన నేపథ్యంలో ఆమెకి అదిరిపోయే ట్యాగ్ ఇచ్చింది. మందబుద్ది అంటూ తేల్చేసింది నైనిక. దెబ్బకి యష్మి కూడా షాక్ అయ్యింది. ఇలా షార్ట్ అండ్ స్వీట్‌గా సందడి చేసింది నైనిక.
ఇదిలా ఉంటే నైనిక ఎంట్రీతో ప్రస్తుతం హౌజ్‌లో నిఖిల్, పృథ్వీరాజ్, యష్మి, విష్ణు ప్రియా, ప్రేరణ, మణికంఠ, నబీల్, కిర్రాక్ సీత ఉన్నారు. ఈ ఎనిమిది మందికి మరో ఎనిమిది మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు కాబోతున్నారు. పాత వారిని మెగా క్లాన్‌గా, కొత్త వారిని రాయల్ క్లాన్‌గా విభజించారు. రెండు టీమ్‌లు ఇకపై గేమ్‌లు గా ఆడబోతున్నారు. గేమ్ వేరే లెవల్‌లో ఉండబోతుందని చెప్పొచ్చు.