మరోవైపు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'వారసుడు' చిత్రాన్ని పెద్ద ఎత్తున సంక్రాంతికి రిలీజ్ చేయనుండడం వివాదంగా మారుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు చిత్రంలో నటిస్తున్నారు. దీనితో ఒక తమిళ చిత్రాన్ని.. తెలుగు చిత్రాలకి నష్టం చేకూర్చేలా భారీ స్థాయిలో రిలీజ్ చేయడం, థియేటర్స్ సమస్య సృష్టించడం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.