తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతకి బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సహకరించాలని కోరారు.
యంగ్ హీరో నితిన్, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం తమ్ముడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నితిన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో సీనియర్ నటి లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ్ముడు ట్రైలర్ లాంచ్ చేశారు.
25
తమ్ముడు బడ్జెట్ పై కామెంట్స్
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతకి బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సహకరించాలని కోరారు. తమ్ముడు మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు బడ్జెట్ అంతకంతకూ పెరిగింది. ఒకరోజు వేణు శ్రీ రాముని పిలిచి బడ్జెట్ గురించి అడిగాను. వేణు శ్రీరామ్ నాతో.. సార్ ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని నేను ముందే చెప్పాను కదా అని తెలిపాడు. నిజమే ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు దాన్ని వెనక్కి తీసుకురావడం కూడా అవసరమే కదా.. అది ఎలా అని అడిగాను. దీంతో వేణు శ్రీరామ్ వెంటనే తన రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధపడ్డాడు.
35
రెమ్యునరేషన్ తగ్గించుకున్న నితిన్
నితిన్ కి కూడా బడ్జెట్ గురించి చెప్పినప్పుడు.. అంకుల్ మీరు ఎంత పంపిస్తారో అంతే ఇవ్వండి.. నేను రెమ్యునరేషన్ గురించి అడగను అని ముందుకు వచ్చినట్లు దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. దిల్ రాజు రెమ్యునరేషన్ ప్రస్తావన తీసుకురావడంతో మీడియా ప్రతినిధులు వెంటనే ప్రశ్నల వర్షం కురిపించారు. రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోలని కూడా ఒప్పించగలరా, ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. నాకు ఆ ధైర్యం ఉంది అంటూ దిల్ రాజు సమాధానం ఇచ్చారు.
హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్లు సహకరిస్తారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. బృందావనం చిత్రం సమయంలో ఎన్టీఆర్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కోసం ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం మహేష్ బాబు, వకీల్ సాబ్ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని దిల్ రాజు తెలిపారు.
55
ఇది పోటీ ప్రపంచం
స్టార్ హీరోలు దొరకరు అనే ఉద్దేశంతో నిర్మాతలు తొందరపడి రెమ్యునరేషన్ ఎక్కువ ఆఫర్ చేస్తుంటారు. ఇది పోటీ ప్రపంచం అలాంటివి తప్పవు. కానీ సందర్భం వచ్చినప్పుడు రెమ్యునరేషన్ విషయంలో సహకరించే హీరోలు కూడా ఇక్కడ ఉన్నారు అని దిల్ రాజు పేర్కొన్నారు.