ఓటీటీలోకి దూసుకొస్తున్న 'థగ్ లైఫ్'..ఇంత త్వరగా ఎందుకంటే

Published : Jun 11, 2025, 07:02 PM IST

కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం. 

PREV
14
'థగ్ లైఫ్' మూవీ

మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'థగ్ లైఫ్'. ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాసర్ వంటి భారీ స్టార్ తారాగణం నటించారు. 38 సంవత్సరాల తర్వాత మణిరత్నం. కమల్ తిరిగి కలవడంతో ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ అయింది. కానీ, సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

24
ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ

స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉందని అభిమానులు వ్యాఖ్యానించారు. చిత్ర బృందం తీవ్రంగా ప్రమోషనల్ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఏమీ వర్కౌట్ కాలేదు . ఈ చిత్రానికి వసూళ్లు దారుణంగా నమోదవుతున్నాయి. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ కాబట్టి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. కానీ ఫ్యాన్స్ ఊహించినంత లేకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు.

34
థగ్ లైఫ్ వసూళ్లు

ఈ చిత్రం మొదటి రోజు రూ. 15.5 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు రూ. 7.15 కోట్లు, మూడవ రోజు రూ. 7.75 కోట్లు, నాల్గవ రోజు రూ. 6.5 కోట్లు, ఐదవ రోజు రూ. 3.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 5 రోజుల్లో దాదాపు రూ. 40 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇది 'ఇండియన్ 2' కలెక్షన్ కంటే తక్కువ అని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

44
త్వరలో OTTలో విడుదల

ఈ పరిస్థితిలో, 'థగ్ లైఫ్ ' సినిమా త్వరలో OTTలో విడుదల కానుందని సమాచారం. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఒక సినిమా OTTలో విడుదల కావడం ఆనవాయితీ. ఈ సినిమా కూడా అదే విధంగా విడుదల అవుతుందని కమల్ హాసన్ ప్రకటించారు. కానీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీనితో వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.  ఈ సినిమా త్వరలో నెట్ ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది. .

Read more Photos on
click me!

Recommended Stories