సిగ్గు, నీతి, మానం లేకుండా ఉండటమే.. చిత్ర పరిశ్రమపై నిర్మాత ల్‌రాజు సంచలన వ్యాఖ్యలు.. హాట్‌ టాపిక్‌

First Published Nov 25, 2022, 3:43 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సినిమా పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ సిగ్గు లేకుండా ఉండాల్సిందేనని షాక్‌ ఇచ్చారు. హీరోలకు వంద కోట్ల పారితోషికం ఇవ్వడంలోనూ నిర్మాతలదే తప్పు అంటూ వ్యాఖ్యానిచ్చాడు. 

దిల్‌రాజు (Dil Raju).. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ని ప్రారంభించి ఇప్పుడు స్టార్‌ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన దళపతి విజయ్‌ తో కలిసి `వారసుడు` చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఇది డబ్బింగ్‌ చిత్రం కావడంతో తెలుగు చిత్రాలకే ప్రయారిటీ ఇవ్వాలని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. దీంతో ఓ వైపు టాలీవుడ్‌, కోలీవుడ్‌ మధ్య వివాదం నడుస్తుంది. 

photo credit-open heart with rk show

ఈ నేపథ్యంలో దిల్‌రాజు ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఏబీఎన్‌లో `ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే` తో చిట్‌చాట్‌ చేశారు. ఇందులో పలు సంచలన, షాకింగ్‌ విషయాలను వెల్లడించారు దిల్‌రాజు. ఇక్కడ ఎవరూ తోపు కాదని, ఎవరూ పెద్ద కాదని, సినిమాని ఎవరూ శాషించలేరని తెలిపారు. చివరికి తాను తనకు కూడా అది సాధ్యం కాదని, ఇక్కడ ఎవరి దారి వాడిదేనని తెలిపారు. తన సినిమా వివాదం నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేయడం దుమారం రేపుతున్నాయి. 
 

photo credit-open heart with rk show

సినిమా అనేది ఒక మాయా ప్రపంచమని, అసలు ప్రొడక్ట్ (సినిమా) చూడకుండా కొనే వస్తువు సినిమానే అని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్‌ దొరికితే హీరో పేరు చెప్పి సినిమాని అమ్మేస్తారని, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆడియెన్స్ తోనే థియేటర్లలోనే సినిమా చూసుకునే పరిస్థితి ఉందన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ ఎందుకు తగ్గిపోతుందనే దానికి కారణం ఇదే అని చెప్పారు. ఈ విషయంలో నిర్మాతలదే తప్పు అన్నారు. ఇండస్ట్రీ అంతా ఒక్కటి అని, ఫ్యామిలీ అని బయటకు చెప్పడానికే ఉంటుందని, కానీ ఎవరి దారి వాడితే అని, ఇండస్ట్రీ కలిసి ఉండటమనేది అసాధ్యమని తెలిపారు దిల్‌రాజు.
 

తన అసలు పేరు వెంకట్‌ రమణారెడ్డి అని, అయితే ఇంట్లో ముద్దుగా రాజు అని పిలుచుకునే వారని, `దిల్‌` సినిమాతో నిర్మాతగా మారడంతో దాన్ని పేరు ముందు తగిలించి `దిల్‌`రాజుని చేశారని తెలిపారు. నిర్మాతగా మారిన కొత్తలో వరుసగా పరాజయాలు చవిచూశానని, చాలా దెబ్బలు తిన్నానని తెలిపారు దిల్‌రాజు. అప్పట్లోనే కోటీ రూపాయలు నష్టపోయానని చెప్పారు. అయితే ఇప్పుడు లాభాల్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. దిల్‌రాజు అంటే ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ బ్రాండ్‌గా ఏర్పడింది. తానంటే చాలా మందికి అసూయ ఉంటుందని, పడని వారు తనపై ఏదో ఒక వివాదం సృష్టిస్తుంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 

హీరోల రెమ్యూనరేషన్స్, వెయ్యి కోట్ల కలెక్షన్లు వంటి వాటిపై దిల్‌రాజు ఓపెన్‌ అయ్యారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో హీరోకి వంద కోట్ల పారితోషికం అంటే అమ్మో వంద కోట్లా అని ఆశ్చర్యంగా చూసేవారు, ఇప్పుడు తెలుగు హీరోలకు వంద కోట్లు ఇస్తున్నారని ఆర్కే ప్రశ్నించగా, ఇచ్చేవాడు ఉండగా, తీసుకునే వారి తప్పేముందన్నారు. ఈ విషయంలో నిర్మాతలు ఆలోచించుకోవాలనే యాంగిల్‌లో రియాక్ట్ అయ్యారు. వెయ్యి కోట్లు కలెక్షన్లు వస్తే నిర్మాతకి మిగిలేదిఎంత అని ప్రశ్నించగా, `బాహుబలి` మొదటి పార్ట్ కి నిర్మాత నష్టాల్లోనే ఉన్నారని తెలిపారు. సినిమా గొప్పగా టాక్‌ వచ్చిందని, కానీ లాభాలు ఏం లేవని తెలిపారు. ఆ నిర్మాత బయట చెప్పుకోలేడు, ఇంట్లో ఉండలేదని చెప్పారు. 
 

తాను ఇండస్ట్రీలోకి వచ్చి 20వేళ్లు అవుతుందని, తనతోపాటు రియల్‌ ఎస్టేట్‌, ఇతర బిజినెస్సులు చేసిన బ్యాచ్‌ ఎక్కడికో ఎదిగిపోయారని, తాను మాత్రం ఇక్కడే ఉన్నానని చెప్పారు. అంతేకాదు ఇక్కడ ఓన్లీ పాపులారిటీ మాత్రమే ఉంటుందని, ఇంకేమీ ఉండదన్నారు. ఆ ఒక్క దానికోసమేనా అని ఆర్కే ప్రశ్నించగా, సినిమా పేరే అందుకొచ్చిందేమో అని అంటూనే సిగ్గు, నీతి, మానం లేకుండా ఉండాలని అంటూ, ఇలా ఉండటమే సినిమా ఇండస్ట్రీ అనే అర్థంలో దిల్‌రాజు వ్యాఖ్యలు చేశారు.  

click me!