కులం, హీరోల 100 కోట్ల రెమ్యునరేషన్ పై దిల్ రాజు థియరీ.. మహా ముదుర్లు ఉన్నారట

First Published Dec 16, 2022, 9:00 PM IST

ఒకప్పుడు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు ఎలాంటి వివాదం, హడావిడి లేకుండా సైలెంట్ గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి పెద్ద విజయాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఏం చేసినా వివాదం అవుతోంది.

ఒకప్పుడు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు ఎలాంటి వివాదం, హడావిడి లేకుండా సైలెంట్ గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి పెద్ద విజయాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఏం చేసినా వివాదం అవుతోంది. తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు చిత్రం వివాదాలకు కారణం అయింది. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలవుతున్నాయి. 

ఈ చిత్రాలతో పాటు దిల్ రాజు వారసుడు చిత్రాన్ని కూడా దించుతున్నారు. భారీ ఎత్తున ఆ చిత్రానికి థియేటర్స్ కట్టబెట్టబోయే ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడే వివాదం ముదురుతోంది. అయితే దిల్ రాజు తన చిత్రాన్ని తాను రిలీజ్ చేసుకుంటే తప్పా.. అన్ని కూర్చుని మాట్లాడుకుంటాం.. వివాదం చేయవద్దు అని అంటున్నారు. 

ఇదిలా ఉండగా దిల్ రాజు స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై మరోసారి స్పందించారు. నిర్మాతలే కావాలనే కొందరు హీరోలకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే హీరోలే నిర్మాతలని కమాండ్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాలపై దిల్ రాజు స్పందించారు. 

అలాంటి ప్రచారం వాస్తవం కాదు అని అన్నారు. నిర్మాతలు ఏమీ అమాయకులు కాదు. హీరో మార్కెట్, బడ్జెట్ లెక్కలు, వసూళ్లు అన్నీ అంచనా వేసుకునే రెమ్యునరేషన్ ఇస్తారు. ఊరికే ఇచ్చేయరు అని దిల్ రాజు అన్నారు. 

ఇక నిర్మాతగా రాణించాలి అంటే అగ్ర కులానికి చెందిన వారు అయి ఉండాలి అనే ఆరోపణలపై కూడా దిల్ రాజు  థియరీ వినిపించారు. తాను రెడ్డి అయినప్పటికీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి  ఏమీ లేదని అన్నారు. జీరో నుంచే పెట్టాను. అల్లు అరవింద్ గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సురేష్ బాబు గారు.. ఆయన తండ్రి వేసిన బాటలో పయనిస్తున్నారు. 

అలాగే అశ్విని దత్ గారు దాదాపు 50 ఏళ్ల క్రితం క్రింది  స్థాయి నుంచి ప్రారంభించారు. ఇక్కడ కులం ప్రస్తావన లేనే లేదు అని దిల్ రాజు తెలిపారు. వారసుడు చిత్రాన్ని మహేష్ తో కానీ, రాంచరణ్ తో కానీ తీద్దామని అనుకున్నా.  కానీ డేట్స్ కుదరక పోవడంతో విజయ్ తో తెరకెక్కిస్తున్నాం అని అన్నారు. 

click me!