
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొంత గ్యాప్‌తో `వకీల్‌సాబ్`(Vakeel Saab)తో రీఎంట్రీ ఇచ్చారు. `పింక్` చిత్రానికిది రీమేక్(Pawan Remake). ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసిందీ చిత్రం. కరోనా క్లిష్టసమయంలోనే ఈ స్థాయి కలెక్షన్లు రావడం విశేషం. ఆ తర్వాత `భీమ్లానాయక్`(Beemla Nayak)తో మరో రీమేక్ చేశారు. ఇది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియమ్`కి రీమేక్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ రెండు చిత్రాలతో నిర్మాతలు సేఫ్‌లో ఉన్నారు.
ఇప్పుడు మరో రీమేక్ చేస్తున్నారు పవన్. `థెరి` రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే హరీష్ శంకర్‌తో ప్రకటించిన `భవదీయుడు భగత్‌సింగ్` స్క్రిప్ట్ కి, `థెరి` మెయిన్ పాయింట్‌ని కలిపి `ఉస్తాద్ భగత్ సింగ్`(Ustaad Bhagath Singh) సినిమా చేస్తున్నారు. సమాకాళీన అంశాలను, మాస్ ఎలిమెంట్లని జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ సుమారు ముప్పైరోజుల డేట్స్ ఇచ్చారట. అత్యంత వేగంగా దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు ఇప్పుడు మరో రీమేక్‌లోనూ పవన్ కనిపించబోతున్నారట. సముద్రఖని రూపొందించిన `వినోదయ సీతం`(Vinodhaya Sitham) చిత్రాన్ని పవన్ రీమేక్ చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. త్వరలోనే ప్రకటన వస్తుందన్నారు. కానీ అంతలోనే రాజకీయాలు మారిపోవడంతో ఆ స్క్రిప్ట్ పక్కకెళ్లింది. వరుసగా సుజిత్ సినిమా, హరీష్ సినిమాని ప్రకటించడంతో ఇక ఈ రీమేక్ ఉండబోదని అంతా అనుకున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ `వినోదయ సీతం` సినిమా రీమేక్‌లో నటించబోతున్నారట. వచ్చే ఏడాది జనవరిలో దీన్ని ప్రారంభించబోతున్నారట. మొదట షూటింగ్ జరుపుకునే చిత్రమిదే అని చర్చ నడుస్తుంది. హరీష్, సుజీత్‌ల సినిమా కంటే దీన్నే పవన్ ఫస్ట్ చేయబోతున్నారట. ప్రస్తుతం పవన్ `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. దీనికోసం చాలా డేట్స్ అవసరమవుతుంది. ఇంకా సుమారు40శాతం చిత్రీకరించాల్సి ఉందని టాక్. ఇది స్ట్రెయిట్ సినిమా కావడం, పైగా కాస్ట్యూమ్ బేస్డ్ పీరియడ్ చిత్రం కావడంతో దీనికి చాలా రోజులు షూటింగ్‌కి పడుతుందట. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కానీ పరిస్థితి. ఈ చిత్ర షూటింగ్ అనుభవంలోనుంచి పవన్ నేర్చుకున్న పాఠాలే `రీమేక్`లు అని తెలుస్తుంది.
స్ట్రెయిట్ సినిమాకి చాలా రోజులు షూటింగ్ టైమ్ పడుతుంది. అది బాక్సాఫీసు వద్ద ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే టెన్షన్ ఉంటుంది. అదే హిట్ సినిమాని రీమేక్ చేస్తే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. పవన్ చేతిలో ఎక్కువ డేట్స్ లేవు. ఆయన వచ్చే ఏడాది ఏపీ జనరల్ ఎలక్షన్లకి ప్రీపేర్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతారు. సినిమాలు చేయడానికి కుదరదు. అందుకే రీమేక్‌లు ఎంచుకుంటున్నారట. దీని ద్వారా ఎక్కువ సినిమాలు చేసి, సాధ్యమైంత వరకు పారితోషికం రూపంలో డబ్బు కూడబెట్టుకోవాలని, ఎలక్షన్లని వాడుకోవాలని అనుకుంటున్నారట పవర్ స్టార్.
పవన్ చేతిలో చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో రీమేక్‌లు అయితే త్వరగా షూటింగ్ పూర్తి చేయొచ్చు. మహా అంటే 20-30 రోజుల్లో ఓ సినిమాని పూర్తి చేయోచ్చు. అంటే నెలకో సినిమాకి డేట్స్ ఇస్తే, ఎలక్షన్ల లోపు రెండు మూడు సినిమాలు పూర్తి చేయోచ్చు. అది అటు ఆర్థికంగా, ఇటు మినిమమ్ గ్యారంటీ ఉండటం, టైమ్ పరంగానూ కలిసొస్తుంది. అందుకే పవన్ రీమేక్ దారి ఎంచుకున్నట్టు సమాచారం. ఆ ప్రకారంగానే `వినోదయ సీతం` చిత్రాన్ని కూడా నెల రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారట పవన్. అందుకే ఆ రీమేక్ కూడా చేయబోతున్నారని సమాచారం. ఇందులో మరో కీలక పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించనున్నారు. సముద్రఖనినే దీనికి దర్శకత్వం వహించనున్నారు.