Dil Raju
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు.. ప్రస్తుతం తెలుగులో టాప్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. ఆయన భారీ సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల `ఫ్యామిలీ స్టార్` చిత్రంతో గట్టిగా దెబ్బతిన్న దిల్ రాజు ఇప్పుడు రామ్ చరణ్‌తో `గేమ్ ఛేంజర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు మూడు వందలకోట్లతో ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు శంకర్.
దిల్ రాజు ఆ మధ్య తరచూ మీడియాలో కనిపించే వారు. ఇప్పుడు తగ్గించారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు `రేవ్` సినిమా కోసం ఆయన మీడియా ముందుకు వచ్చారు. `రేవ్` మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి గెస్ట్ గా దిల్ రాజు హాజరయ్యారు. ఈ సినిమాలో భాగమైన జర్నలిస్ట్ లు రాంబాబు, ప్రభులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లు తమ సినిమాలకు వీళ్లు రివ్యూలు రాసేవాళ్లు అని, ఇప్పుడు వాళ్ల సినిమాలే వస్తున్నాయి. దీనికి నేనే రివ్యూ రైటర్‌ని అవుతాను. సినిమా చూశాక తానే రివ్యూ రాస్తా అని తెలిపారు దిల్‌రాజు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాను జనం వద్దకు తీసుకెళ్లడం కష్టమని, కంటెంట్‌తోనే వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో పాడింగ్ కూడా తోడవుతుంది. తమలాంటి పెద్దలా సపోర్ట్ కూడా ఉండాలని తెలిపారు. అయితే ఇప్పుడు కంటెంట్ చాలా ముఖ్యమని, అది బాగుంటే, సినిమా జనాల్లోకి వెళ్తుందని, మీడియా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఇలాంటి సినిమాలు చాలా స్లోగా వెళ్తాయని తెలిపారు.
ఈ క్రమంలోనే దిల్ రాజు హాట్ కామెంట్ చేశాడు. కంటెంట్ బాగున్నా సినిమాలకు స్లోగా జనం వస్తారని, కానీ అంత వరకు మనం వెయిట్ చేయడం లేదని, నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని, కానీ మన ఆడియెన్స్ మంచి సినిమాలను ఆదరిస్తారని, కానీ వాళ్లనే మనం చెడగొడుతున్నామని తెలిపారు. ఆడియెన్స్ ని థియేటర్ వద్దకు రాకుండా చేస్తున్నామని తెలిపారు. ఓటీటీల కారణంగా నాలుగు వారాల్లోనే సినిమా ఓటీటీలలో వస్తుందని, అందుకే వాళ్లకి థియేటర్‌కి ఆడియెన్స్ కి ఆడియెన్స్ రావడం తగ్గిపోయిందని తెలిపారు. ఓ రకంగా తనతోపాటు ఇతర మేకర్స్ కి ఆయన వార్నింగ్ ఇచ్చాడు దిల్ రాజు.
`రేవ్` సినిమా గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్ చూశానని, బాగుందని, ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని, తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని దిల్ రాజు కోరుకున్నారు. ఈ మూవీ ఈ నెల 23న విడుదల కాబోతుంది.