గద్దర్ అవార్డుల నిర్వహణపై, దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అని విమర్శలు రావడంతో దిల్ రాజు స్పందించారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో దిల్ రాజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దిల్ రాజు నిర్మాతగా బిజీగా ఉంటూనే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
25
గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు
ఆయన ఆధ్వర్యంలోనే ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. అయితే గద్దర్ అవార్డుల నిర్వహణపై, దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అని కామెంట్స్ చేస్తున్నారంటూ ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించారు. దిల్ రాజు తాను నిర్మించిన చిత్రాలు, డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలు, తన సన్నిహితులు రూపొందించిన చిత్రాలకు మాత్రమే గద్దర్ అవార్డులు ఇచ్చుకున్నారు అంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
35
వాళ్ళకి అవార్డులు ఎలా వచ్చాయి ?
దీని గురించి యాంకర్ ప్రశ్నించినప్పుడు దిల్ రాజు స్పందించారు. ఒక అవార్డుల వేడుక జరిగినప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజం. వస్తున్న విమర్శలే నిజమైతే మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదా? వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదా? నా సన్నిహితులకు మాత్రమే అవార్డులు ఇచ్చుకుంటే వీళ్ళందరికీ ఎలా అవార్డులు వచ్చాయి అని దిల్ రాజు ప్రశ్నించారు.
అవార్డుల విషయంలో కొందరికి అన్యాయం జరిగింది. నాని దసరా చిత్రానికి ఎలాంటి అవార్డు దక్కకుండా తెలివిగా తప్పించారు అని విమర్శపై కూడా దిల్ రాజు స్పందించారు. దసరా చిత్ర హీరో నాని నాకు బాగా క్లోజ్.. ఆ చిత్ర డైరెక్టర్ నిర్మాతతో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది. అలాంటప్పుడు నేనెందుకు ఆ చిత్రాన్ని తప్పిస్తాను. జ్యూరీ మెంబర్స్ ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకుని ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఆ క్రమంలోనే దసరా చిత్రానికి అవార్డు రాలేదు.
గద్దర్ అవార్డుల ఎంపిక విషయంలో కంప్లీట్ డెసిషన్ జ్యూరీ మెంబర్స్ దే అని దిల్ రాజు తెలిపారు. నేను కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ గద్దర్ అవార్డుల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. మేము ఇచ్చిన లిస్ట్ నే ఆయన అప్రూవ్ చేశారు అని దిల్ రాజు తెలిపారు.
55
తమ్ముడు మూవీ ఫ్యామిలీ స్టోరీ కాదు
ఇక గద్దర్ అవార్డుల వేడుకకి చాలామందిని దిల్ రాజు ఇన్వైట్ చేయలేదు అనే విమర్శ కూడా ఉంది. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నా బాధ్యతలు పైపైన మాత్రమే ఉంటాయి. కార్యనిర్వహణ మొత్తం ఎండి, ఈడి స్థాయిలలో జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన గెస్ట్ ల లిస్ట్ ని నేను అప్రూవ్ చేశాను. కాకపోతే ఇన్విటేషన్ అందడంలో కాస్త ఆలస్యం అయింది. కానీ మెజారిటీ ప్రముఖులు అందరిని ఇన్వైట్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు.
ఇక దిల్ రాజు తమ్ముడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రాన్ని హీరో నానితో చేద్దామని అనుకున్నట్లు తెలిపారు. కానీ నాని ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఆ తర్వాత నితిన్ ని ఎంపిక చేశాం. తమ్ముడు చిత్రం ఫ్యామిలీ స్టోరీ కాదు. అద్భుతమైన విజువల్స్ ఉండే థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. అందుకే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు అని దిల్ రాజు తెలిపారు. కేవలం సినిమా మేకింగ్ కోసమే 35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.