స్టార్ హీరోలు నటించిన సినిమాలు కొన్ని భారీ హైప్ తో విడుదలై నిరాశ పరుస్తూ ఉంటాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నిర్మించిన కొన్ని ఫ్లాప్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను నిర్మించిన ఫ్లాప్ మూవీలో కొన్ని చిత్రాలు హిట్ కావాల్సింది. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే అవి సూపర్ హిట్ అయ్యేవి. కానీ డెసిషన్ తీసుకునే మైండ్స్ లో విభేదాలు వచ్చినప్పుడు ఒక్కరి నిర్ణయానికే రిజల్ట్ వదిలేసి ముందుకు వెళతాం. అలాంటప్పుడు ఆ సినిమాలు తేడా కొట్టాయి. రామరామ కృష్ణ కృష్ణ, మున్నా, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాలు మేము జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యాయి అని దిల్ రాజు అన్నారు.