కోలుకోలేని దెబ్బ కొట్టిన సౌందర్య మూవీ.. డబ్బులు లేక బతిమాలుకున్న ఆ నిర్మాత ఆస్తి ఇప్పుడు 2000 కోట్లు ?

Published : Jul 28, 2025, 07:59 AM IST

సౌందర్య సినిమా వల్ల ఓ నిర్మాత కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరు. 

PREV
15
టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా సౌందర్య 

టాలీవుడ్ లో అగ్ర నటీమణిగా వెలుగు వెలిగిన సౌందర్య గురించి పరిచయం అవసరం లేదు. దాదాపుగా ఆమె అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలసి నటించారు. సౌందర్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించారు. సౌందర్య నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి ఒకటి. 

DID YOU KNOW ?
ఒకే ఏడాది 6 సూపర్ హిట్లు 
2017లో దిల్ రాజు నిర్మించిన 6 చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. 
25
నిర్మాతకి దారుణమైన నష్టం 

ఆ చిత్రం వల్ల టాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు దారుణంగా నష్టపోయారు. ఆయన ఎవరో కాదు దిల్ రాజు. దిల్ రాజు అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలో సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. హర్షిత ఫిలిమ్స్ అని బ్యానర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు అప్పట్లో మూడు సినిమాలని కొని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ మూడు చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీనితో కోటి రూపాయల వరకు నష్టం వచ్చింది. 90వ దశకంలో కోటి రూపాయలు అంటే మాటలు కాదు. 

35
సౌందర్య మూవీతో దిల్ రాజు ఎలా నష్టపోయారంటే 

 ఆ వెంటనే సౌందర్య నటించిన అరుంధతి మూవీని 35 లక్షలకు కొని డిస్ట్రిబ్యూట్ చేశారు. కనీసం పబ్లిసిటీ, పోస్టర్ ఖర్చులు కూడా రాలేదట. అంతటి దారుణమైన డిజాస్టర్ గా ఆ మూవీ నిలిచింది. మొత్తం 35 లక్షలు పోయాయి. ఆల్రెడీ అంతకు ముందు చిత్రాల వల్ల కోటి రూపాయలు అప్పు ఉంది. దీనికితోడు మరో 35 లక్షలు చేరాయి. దీనితో దిల్ రాజు కుటుంబంలో అందరూ ఇక సినిమాల జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయానికి వచ్చారట. 

45
పెళ్లి పందిరి మూవీ టర్నింగ్ పాయింట్

మనకున్న ఆటో మొబైల్ వ్యాపారం చేసుకుందాం అని అనుకున్నారట. కానీ దిల్ రాజుకి కాస్ట్యూమ్ కృష్ణారావు ద్వారా జగపతి బాబు పెళ్లి పందిరి చిత్రం కొనే అవకాశం వచ్చింది. కుటుంబ సభ్యులని ఎలాగోలా ఒప్పించి ఆ చిత్రం కొన్నారట. ఈ మూవీ వర్కౌట్ అయితే ఒకే.. లేకుంటే ఇదే లాస్ట్ మూవీ అని దిల్ రాజు డిసైడ్ అయ్యారట. 60 లక్షలకు ఆ చిత్రానికి డీల్ కుదిరింది.

55
దిల్ రాజు ఆస్తి ఎంతో తెలుసా 

ఆ 60 లక్షలు డబ్బు దిల్ రాజు వద్ద లేదు. అప్పు కోసం దిల్ రాజు పడరాని పాట్లు పడ్డారట. లెజెండ్రీ నిర్మాత, రచయిత ఎమ్మెస్ రాజు సహాయంతో కొంత డబ్బు అందింది. మిగిలిన డబ్బు కోసం రిలీజ్ టైంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. మొత్తానికి పెళ్లి పందిరి చిత్రం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దిల్ రాజుకి మంచి లాభాలు వచ్చాయి. ఆ విధంగా దిల్ రాజు సినిమా జర్నీ మొదలైంది. అప్పుడు డబ్బు కోసం అంత కష్టాలు పడ్డ దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్. 50 పైగా సినిమాలు నిర్మించారు. ఆయన నెట్ వర్త్ 2000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories